!
వేసవిలో ఎండ ఎంత తీవ్రంగా ఉన్నా, సాయంకాలం వేళ మల్లెలను చూడగానే రోజంతా శరీరకష్టంతో అలసిపోయినవారి మనసంతా ఆహ్లాదం నిండుతుంది. మధురానుభూతి పొందుతారు. పరిమళానికి మారుపేరయిన పరిమళభరిత మల్లెలంటే అందరికీ ఇష్టమే! అంతేకాదు చల్లదనానికి, కమ్మదనానికి, గుభాలింపులకు మరు పేరైన మల్లెపూలు.... మహిళల సిగలో సహజ ఆభరణాలు. మండుటెండలో
మల్లెల సౌరభం జీవితాలనే మార్చేస్తుంది. ఇది మల్లెపూల మహత్యం.