”శోధిని”

Sunday, 31 August 2014

బాపు ఇక లేరు.


ప్రముఖ సినీ దర్శకుడు, గొప్ప చిత్రకారుడు  మహాన్నత వ్యక్తి శ్రీ బాపు గారు మనందరినీ వదలి వెళ్ళిపోయారు.  ఆయన ఆత్మకి శాంతి కలగాలని మనసారా ప్రార్థిస్తూ... వారి కుటుంబసభ్యులకు నా  ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. 

Thursday, 28 August 2014

ప్రణవనాద స్వరూపుడు !



బాద్రపదమాసం శుక్లపక్షంలో చవితి నాడు మధ్యాహ్నం వేళ  పార్వతీదేవికి పుత్రునిగా వినాయకుడు అవతరించాడు.  చవితి ఏ రోజు మధ్యాహ్నం వేళ  ఉంటుందో, ఆరోజు  వినాయకచవితి పండుగను చేసుకోవడం వలన సకల శుభాలు, సౌఖ్యాలు  చేకూరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.  ఈ చవితి ఆదివారం కానీ, మంగళవారం గానీ వస్తే చాలా మంచిదంటారు.   మట్టితో చేసి రంగులువేయని వినాయక విగ్రహాన్ని పూజించడం వలన  కరువు కాటకాలు రాకుండా పంటలు సమృద్ధిగా పండుతాయని, వ్యవసాయాభివృద్ది కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. ఓంకారానికి మరో పేరు ప్రణవనాదం.  ఆ ప్రణవనాద స్వరూపుడు విఘ్నేశ్వరుడు.  అందుకే వినాయకచవితి నాడు నీటిలో కరిగే మట్టి విగ్రహాన్ని పూజించాలి... పర్యావరణాన్ని పరిరక్షించాలి.  కొండంత దేవుడుకి కొండంత పత్రి సమర్పించాకపోయినా ఫలమో, పత్రమో ఏదో ఒకటి స్వామికి నివేదిస్తే చాలు గణనాధుడు తృప్తి చెందుతాడు. తొమ్మిది రోజుల పాటు పూజలు నిర్వహించి, ఆ తరువాత దేవతాముర్తిని నిమజ్జనం చేయడం అనాదిగా వస్తున్నది.  వినాయకచవితిని భారతదేశమంతా అత్యంత వైభవంగా జరుపుకోవడం మన సంస్కృతిని వెల్లడి చేస్తుంది.                                                                      

            మిత్రులందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు!

Wednesday, 27 August 2014

ద్వితీయ విజేతగా...!


 
మనసులో మెదిలే ఆహ్లాదవీచిక
సుగంధపరిమళాల మరీచిక
మనసంస్కృతి, సంప్రదాయాలకు సరైన వేదిక
మనతెలుగు మన సంస్కృతి ముఖపుస్తక నివేదిక
మనకట్టూ బొట్టు, ఆచారవ్యవహారాలు...
మన సంస్కృతీ సంప్రదాలను తెలియజేస్తూ...
ముఖపుస్తక ప్రపంచంలో సరికొత్త సంచలం!!
పిల్లలకు నీతి పద్యాలు, మహానుభావుల సూక్తులు
యువతీ యువకులకు పురాణ విజ్ఞానం
దేవాలయాలలో పాటించవలసిన నియమాలు
ఇంటి పూజలో అనుసరించాల్సిన పద్దతులు
ఇవీమన ముఖ పుస్తకంలో కనిపించాల్సిన రచనలు
మన తెలుగు మన సంస్కృతి ముఖపుస్తకం
భక్తి పారవశ్యంతో...పదహారువేల సభ్యులతో...
మూడవ వసంతంలోకి అడుగుపెట్టిన శుభసందర్భంగా..
ప్రియనిర్వాహకులు త్రినాద్ గారికి, మంజు గారికి,
సురేంద్ర గారికి, స్వప్న గారికి, విజయ సువర్ణ గారికి
అభినందనలు... శుభాభివందనాలు!
 

Saturday, 16 August 2014

వెన్న దొంగ పుట్టినరోజు !


శ్రీ కృష్టాష్టమి ఆదివారం రోజున వస్తే ఎంతో శుభప్రదమని, సకల శుభాలు కలుగుతాయని మన పురాణాలు చెబుతున్నాయి.  ఈ సంవత్సరం ఈ రోజు ఆదివారం శ్రీ కృష్టాష్టమి రావడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  లోక కల్యాణార్థం శ్రీ మహావిష్ణువు కృష్ణుడి రూపంలో శ్రావణమాసం, అష్టమి ఆదివారం, రోహిణీ నక్షత్రంలో జన్మించాడు.  అందుకే ఈ రోజున   శ్రీ కృష్ణుడిని  భక్తిశ్రద్ధలతో పూజిస్తే ... అష్టైశ్వర్యాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం.  అందరికీ  శ్రీ కృష్టాష్టమి శుభాకాంక్షలు!

 

Saturday, 9 August 2014

అన్నా చెల్లెల అనుబంధం !


భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక రాఖీ పౌర్ణమి.  రోజున సోదరి, సోదరుడికి కట్టే రక్షణ కవచం రాఖీ.  మహిళలకు రక్షణగా నిలవడడమే పండుగ ఉద్దేశం.  స్త్రీల పట్ల సోదరభావం, పవిత్రభావం ప్రతి ఒక్కరిలో కలగాలి. సమాజంలో తనకు పూర్తి రక్షణ ఉందన్న నమ్మకం ప్రతి మహిళలో కలిగించాలి.  అప్పుడే నిజమైన రక్షాబంధం.


Thursday, 7 August 2014

ప్రతి ఇంటా శ్రావణ శోభ !


     శ్రీ మహా విష్ణువు జన్మ నక్షత్రం మైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో వ్రతాలు, పూజలు ఆచరించడం ఎంతో శుభకరమని  మన పురాణాలు చెబుతున్నాయి.  అంతేకాకుండా చంద్రుడు శ్రవణా నక్షత్రంలో సంచరించే మాసం కావడంతో శ్రావణ మాసంగా పాచుర్యం పొందింది.  ఈ మాసం ముఖ్యంగా మహిళలకు ఎంతో సౌభాగ్యప్రదం. ఈ నెలంతా ప్రతి ఇంటా ఆధ్యాత్మిక సుమాల గుబాళింపులే దర్శనమిస్తాయి. శ్రావణ మాసంలో మంగళ, శుక్రవారాలలో అమ్మవారిని  భక్తిశ్రద్దలతో నిండు మనసుతో  పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ వరలక్ష్మి వ్రతం మహిళలందరికీ మంగలప్రదమైనది...ఎంతో శుభదాయకమైనది. 

Tuesday, 5 August 2014

అమ్మంటే ...!



అమ్మంటే ...
ఒక  అద్భుతం 
ఒక  అనుభూతి 
ఒక  జ్ఞాపకం 
ఒక  వాస్తవం 
ఒక  ఆదర్శం 
భూత, వర్తమాన 
భవిష్యత్తు  కాలానికి 
ఓ  దర్పణం !


Saturday, 2 August 2014

స్వచ్చమైన స్నేహం!


మనసుకు శ్వాస లాంటిది 
తనువుకు ప్రాణం లాంటిది 
ఎటువంటి కల్మషం లేని
పసిపాప మనసు లాంటిది
స్వచ్చమైన  స్నేహం!



ఇద్దరు చంద్రులు కలిసిన శుభ వేళ !

రాష్ట్రం రెండుగా విడిపోయిన తరువాత ముఖ్యమంత్రుల హోదాలో తొలిసారిగా ఇద్దరు తెలుగుముఖ్యమంత్రులు చేతులు కలిపిన దృశ్యం !