శ్రీ కృష్టాష్టమి ఆదివారం రోజున వస్తే ఎంతో శుభప్రదమని, సకల శుభాలు కలుగుతాయని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ సంవత్సరం ఈ రోజు ఆదివారం శ్రీ కృష్టాష్టమి రావడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లోక కల్యాణార్థం శ్రీ మహావిష్ణువు కృష్ణుడి రూపంలో శ్రావణమాసం, అష్టమి ఆదివారం, రోహిణీ నక్షత్రంలో జన్మించాడు. అందుకే ఈ రోజున శ్రీ కృష్ణుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే ... అష్టైశ్వర్యాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. అందరికీ శ్రీ కృష్టాష్టమి శుభాకాంక్షలు!
No comments:
Post a Comment