తమ భర్తలను ఆఫీస్ కి పంపించి మాటల్లో పడ్డారు పక్కింటి వనజాక్షి, కామాక్షి
వనజాక్షి : "పని పిల్లను మాన్పించాను... పని చేసుకోలేక విసుగు వస్తోంది వదిన"
కామాక్షి : "చిన్న పిల్లను పనిలో పెట్టుకోవడం నేరమని మాన్పించావా?"
వనజాక్షి : "అదేం కాదు వదిన... ఆ పిల్లకి మన కాలనీ విషయాలు తెలియడం లేదు"
కామాక్షి : "కాలనీ విషయాలు చెప్పని పని మనిషి ఎందుకు దండగ... మంచి పని చేసావు"