”శోధిని”

Saturday, 31 May 2014

'అన్నం పరబ్రహ్మ స్వరూపం'



వేడుకలు, శుభకార్యాల్లో విందు భోజనాల ఏర్పాటు చేయడం మన దేశ సంప్రదాయాలలో ఓ భాగం.  అయితే ఇటీవల కొంత కాలంగా ఇలాంటి వేడుకలు ఆడంబర ప్రదర్శనాలుగా మారిపోయి, ఎంతో విలువైన ఆహార పదార్థాలను చెత్త కుప్పల పాలు చేయడం చూస్తున్నాం.  దేశంలో కోట్లాది మంది తిండి దొరక్క అల్లాడుతుంటే విందులు, వినోదాల పేరిట ఆట్టహాసాలకుపోయి భారీగా ఆహారాన్ని వృధా చేయడం బాధాకరం.  శుభకార్యాలను ఆడంబరంగా చేసుకోవచ్చు.  కాని, ఆహారపదార్థాలను వృధా చేయడం బాగులేదు.  ఆర్భాటాలకు పోయి ఎన్నో రకాల వంటలు చేసి వృధా చేసే బదులు అందరికీ ఇష్టమైన కొన్ని రకాల వంటలు చేస్తే...ఈ వృధాను చాలా వరకూ అరికట్టవచ్చు.  అదేవిధంగా శుభకార్యాల్లో పాల్గొనే వాళ్ళు ఎంత వరకు తినగలరో అంత  వరకే వడ్డించు కోవడం మరవద్దు.  నచ్చకపోతే  వృధాగా పారేయాలి కాబట్టి,  నచ్చని ఆహార పదార్థాలను వడ్డించుకోకపోవడం ఉత్తమం. 'అన్నం పరబ్రహ్మ స్వరూపం' అని మరచిపోవద్దు.