”శోధిని”

Saturday 10 May 2014

'అ' అంటే... అనురాగం !


പ്രമാണം:Sikkim 1.jpg

'అ' అంటే అనురాగం
'మ్మ' అంటే మమకారం
వెరసి అమ్మంటే ...
ప్రేమానురాగాల అమృత పాత్ర !
అందుకే...!
అమ్మ భగవంతుని ప్రతిరూపం ...
అమ్మ  పిలుపు ఎంతో మధురాతి మధురం!
అమ్మ  పదంలో కమ్మదనం ...
అమ్మ మనసు ఎంతో మెత్తదనం !
జీవితాన్ని  ఇచ్చే మాతృమూర్తి...
ప్రేమను పంచే ప్రేమ మూర్తి...
తన  బిడ్డల ఉన్నతికోసం ...
నిరంతరం  శ్రమించే త్యాగమూర్తి !

    మిత్రులందరికీ  మాతృమూర్తి దినోత్సవ శుభాకాంక్షలు!