”శోధిని”

Tuesday 19 June 2012

పిల్లలతో వెట్టి చాకిరీ



ఇంటిపని కోసం బాలికలను ఉపయోగించుకోవడం సహించరాని నేరం.  మనకు ఎన్ని చట్టాలున్నా దురాచారాన్ని ఆపలేక పోతున్నాం. ప్రభుత్వం ఇంటి పనిని కూడా బాల కార్మిక చట్టం కిందికి తెచ్చింది కానీ, నేడు ఆర్ధికంగాను ఉన్నత స్థాయిలో వుండే వ్యక్తులు  బాల కార్మికుల చేత పని చేయించుకుంటున్నారు. చట్టాలు ఇతరులకే కానీ మనకు కాదని వాళ్ళ ధోరణిటీవీ లోనూ, మీటింగ్ లలోనూ బాల కార్మికుల నిర్మూలనే తమ ద్యేయం అంటూ  ఉపన్యాసాలు దంచేస్తారు. వీరి విషయానికి వచ్చేసరికి అవి కనిపించవు.  బాల కార్మికుల నిర్మూలన కోసం కృషి చేయాల్సిన అధికారులే తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరించడంతో ఎంతో మంది చిన్నారులు రోడ్డునపడుతున్నారు. అధికారులు ఇలా ప్రవర్తించడం రాజ్యాంగాన్ని ఉల్లంగించడమే అవుతుంది. న్యూస్ పేపర్ యాజమానులు  బాలకార్మికుల గురించి తెగ రాసేస్తుంటారు. వాళ్ళ పైన ఎక్కడలేని  ప్రేమ ఒలకపోస్తారు. కానీ, వారి పేపర్ ప్రింట్ అయిన దగ్గర నుంచి ప్రజలకు చేరే వరకు బాల కార్మికులతోనే పని చేయించుకుంటున్నారు.  ఎదుటి వారికి నీతులు చెప్పడమే కానీ మనకు కాదని వాళ్ళ ఉద్దేశం కాబోలు.  మగపిల్లలు  హోటల్స్ లోనూ, చిన్న చిన్న పరిశ్రమలలోనూ శ్రమ దోపిడీకి గురవుతుంటే , ఆడపిల్లలు ఇంటిపనిలో 24 గంటలు  చాకిరీ చేస్తూ లోలోన కుమిలి పోతున్నారు.  పని సరిగా చేయడంలేదని యజమానులు  వేధించడం, కొట్టడం జరుగుతోంది.  ప్రభుత్వ అధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప, బాలకార్మికులను ఆదుకోవడంలో శ్రద్ధ కనపరచడంలేదు.  

16 comments:

భాస్కర్ కె said...

100% nijam, emi cheyyaleka pothunnam .
manchi topic.

రవిశేఖర్ హృ(మ)ది లో said...

మీ ఆవేదన మాది కూడా!చట్టాలెన్ని వున్నా అమలు చేసే వారు సరిగా లేకపోతే పరిస్థితులు ఇలాగే వుంటాయి.బాల కార్మికుల గురించి వారి కష్టాల గురించి నా బ్లాగు లో బాల్యం అనే కవితలో వ్రాసాను చూడగలరు.

Unknown said...

ఇలా బాల ల చేత పని చేపించే యజమానులని గుర్రం తోకకి కట్టి ఈడ్చుక పోవాలి. సాధారణంగా నీతులు అధికంగా చెప్పే కుటుంభాలలో ఈ జాడ్యం ఉంటుంది.

Anonymous said...

సరైన తిండి, చదువు చెప్పించలేని తల్లిదండ్రులు భాధ్యతా రాహిత్యంగా కని, దేశం/సమాజం మీదికి తోలడం దీనికి మొదటికారణం.

Meraj Fathima said...

సర్ , చట్టాలు ఉన్నాయి కానీ, శిక్షలు లేవు, మానవత్వం , మంచి ,దయ, జాలి ,కరుణ, ఇవన్నీ చెప్పే కథలు ,సంస్కృతి దూరం అవుతుంది. ఎవిదంగానైనా ఎలాగైనా ఆకరికి ఎదుటివాని రక్త,మాంసాలైనా దోచుకోవాలి అనే రాక్షష ప్ర వ్రుత్తి . నాగేంద్ర గారూ ఇలాంటి విషయాలు మనసుని కదిలిస్తాయి, యుద్ద్ధం చేయండి మీ వంతు, ప్రతిచోటా అందరం చేద్దాం.

కాయల నాగేంద్ర said...

మీ స్పందనకు ధన్యవాదాలు!

కాయల నాగేంద్ర said...

అవునండీ...చట్టాలు అమలు పరచే వారు కావాలి.

కాయల నాగేంద్ర said...

బాగా చెప్పారండీ!

కాయల నాగేంద్ర said...

మీరన్నట్లు మొదటి తప్పు తల్లిదండ్రులది. తర్వాత ముద్దాయిలు ప్రభుత్వం, సమాజం.

కాయల నాగేంద్ర said...

డబ్బున్న అహంకారులకు జాలి, దయ, వుండవండీ .. అందుకే అలా ప్రవర్తిస్తున్నారు.

వనజ తాతినేని/VanajaTatineni said...

నిర్భంద విద్య అమలు చేస్తేనే కాని ఈ దేశంలో చాలా సమస్యలు పరిష్కారం కావండి. అవిద్య,నిరుద్యోగం,కుటుంబ నియంత్రణ,వ్యావసాయిక, పారిశ్రామిక అభివృద్ధి ఇలాటివన్నీ ఆ ఒక్క పనితో సాధ్యం అవుతాయి.
పిల్లల పాలిట పని భూతం ని అందరు నిరసించాల్సిందే!

జలతారు వెన్నెల said...

ఒకప్పుడు నేను కూడా ఇలా పనిపిల్లల చేత పని చేయించుకున్నాను కాబట్టి కామెంట్ పెట్టడానికి సిగ్గుగా అనిపించింది. కాని మా ఇంట్లో ఒకరిగానే చూసుకున్నాను. అయినా తప్పే లేండి.

కాయల నాగేంద్ర said...

నిర్భంద విద్య అమలు చేయాలంటే ప్రభుత్వం ముందుకు రాయాలి.
ఇలాంటి మంచి పనులు చేయడానికి ప్రభుత్వానికి ఇష్టం ఉండదు. ఎందుకంటే
పిల్లలకు ఓటు హక్కు లేదు కాబట్టి.

కాయల నాగేంద్ర said...

మీ తప్పు మీరు వొప్పుకున్నందుకు అభినందనలు వెన్నెల గారు!

శ్రీ said...

"బాల కార్మికుల చేత పని చేయించుకోవటం లేదు "
అని బైట బోర్డులు పెట్టుకొనే బోలెడు పరిశ్రమలలో
ఇప్పటికీ పిల్లల చేత పనులు చేయించుకుంటున్నారండీ!
శివకాశి లో మందుగుండు సామగ్రి తయారుచేసే వాళ్ళలో చాలామంది పిల్లలేనట...
వోట్లకోసం ఏదైనా చేసే నాయకులు...
వీళ్ళ కోసం ఎందుకు చేస్తారండీ??
ఇది నిజంగా నేటి సామాజిక సమస్యల్లో ఒకటిగా ఎప్పటికీ మిగిలిపోతుందేమో???
@శ్రీ

కాయల నాగేంద్ర said...

మీ స్పందనకు ధన్యవాదాలండీ!