హిందువులకు గొప్ప పర్వదినం 'శివరాత్రి '. భక్తి, ప్రపత్తులతో పూజిస్తూ 'ఓం నమశ్శివాయ... హరహర మహాదేవ... శంభోశంకర' స్మరణతో మారుమ్రోగే రోజు 'శివరాత్రి. శాంతముర్తి, లింగమూర్తి అయిన శివుడు జ్యోతిర్లింగ రూపంలో అర్చింపబడతాడు... పూజింపబడతాడు. సృష్టి లయకారుడు పరమ శివుడు.
భక్తవశంకరుడు... భోలాశంకరుడు సమస్త జగతికి ఆది గురువు లింగస్వరూపుడు
శివుడు. మాఘమాసం బహుళ చతుర్ధశి రోజున పరమ శివుడు లింగరూపంలో
ఆవిర్భవించాడు. ఈ రోజు త్రినేత్రుని దివ్యరూపం కోటి కాంతులై ప్రజ్వరిల్లుతుంది.. పరమేశ్వరుని మంత్రం 'ఓం నమశ్శివాయ'. ఈ పంచాక్షరీ మంత్రం పరబ్రహ్మమయం. ఈ మంత్ర మహిమ గురించి ఈశ్వరుడే స్వయంగా చెప్పాడని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ మంత్రం పలికినవారికి ఎంతఫలం కలుగుతుందో ... విన్నవారికీ అంతే ఫలితం కలుగుతుందని, తెలిసీతెలియక చేసిన పాపాలు, దోషాలు తొలగిపోయి సుఖాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈరోజున శివక్షేత్రాలు, పంచాక్షరీ మంత్రాన్ని జపించడం మరింత విశేషదాయకం. ఈ పర్వదినాన పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణం జరిపించడం ఆచారం. శివార్చన, ఉపవాసం, జాగారం శివరాత్రి నాడు చేయాల్సిన ముఖ్యమైన మూడు విధులు.
మిత్రులందరికీ శివరాత్రి పర్వదినా శుభాకాంక్షలు!
మిత్రులందరికీ శివరాత్రి పర్వదినా శుభాకాంక్షలు!