ఓపెన్ గా మాట్లాడుతూ
నిజాయితీగా వుంటూ
నిత్యనూతనంగా
నా హృదిలో
ప్రేమ దీపాన్ని వెలిగించావు
నీ ఆప్యాయతానురాగాల్లో
నన్ను ముంచావు
నీ ప్రేమను శ్వాసిస్తూ
నీ ప్రేమ సాగరంలో
ఓలలాడుతున్నాను
అందుకే నవ్వంటే ఇష్టం
నీ ప్రేమంటే మరీ ఇష్టం!