”శోధిని”

Wednesday 20 March 2019

వసంతోత్సవం

వసంత ఋతువు ఆగమనాన్ని పురష్కరించుకొని పిల్లలు, పెద్దలు ఆనందోత్సాలతో... ఆహ్లాదంగా జరుపుకునే సరదా పండుగ హోలి.  వసంత వేల ప్రకృతిలోని అనేక రంగుల పూలతో మమేకమయ్యే రోజు హోలి పూర్ణమి.  సంప్రదాయ బద్దమైన రంగుల పండుగ కాబట్టి,  రకరకాల పూలతో తయారు చేసుకున్న రంగులతోనే రంగులు చల్లుకుని, కేరింతలతో, ఆటపాటలతో ఆనందంగా హోలి జరుపుకోవడం ఉత్తమం. 

                        అందరికీ హోలీ శుభాకాంక్షలు!


Friday 15 March 2019

జలదుర్గ

హైదరాబాద్, ఎస్.ఆర్ నగర్ సమీపంలోని బల్కంపేట  ఓ బావిలో వెలసిన   ఎల్లమ్మ అమ్మవారు భక్తులకు సర్వశుభాలను ప్రసాదిస్తున్నారు. అమ్మవారి శిరస్సు భాగం నుంచి నిత్యం జలధార ప్రవహిస్తూ ఉండటం ఇక్కడ ప్రత్యేకత.  ఆ పవిత్రజలాన్నే భక్తులు తీర్థంగా స్వకరిస్తూ ఉంటారు.   జలదుర్గగా పూజలందుకుంటున్న అమ్మవారిని  బల్కంపేట ఎల్లమ్మగానూ, రేణుకా ఎల్లమ్మగాను పిలుస్తుంటారు.     ఎల్లమ్మకు ప్రీతిపాత్రమైన ఆది, మంగళ, గురువారాల్లో భక్తులు అధికసంఖ్యలో ఈ క్షేత్రాన్ని సందర్శించి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితి. 

Sunday 3 March 2019

పరమ పవిత్రమైన రోజు ...మహాశివరాత్రి.

అఖిల భక్తకోటికి పరమ పవిత్రమైన రోజు ...మహాశివరాత్రి.  పగలంతా ఉపవాసం, రాత్రంతా జాగారం, రోజంతా శివనామస్మరణం.     శివుడిని ప్రసన్నం చూసుకోవడానికి మంత్రాలు, స్తోత్రాలు చదవాల్సిన అవసరం లేదు.  'ఓం నమశ్శివాయ' అంటూ కాసిన్ని శుద్ధజాలాలు శివలింగానికి సమర్పించినా,  శివుడు మురిసిపోయి ముక్తిని ప్రసాదిస్తాడు.  పూజాసమయంలో తెలిసీతెలియక చేసిన అపరాధాలను మన్నించమని వేడుకుంటే చాలు ఆయన పెద్ద మనసుతో  మన్నిస్తాడు.  నిర్మలమైన హృదయంతో మారేడుదళాలను, ధూపదీప నైవేద్యాలను, తాంబూల దక్షిణలను, ఫలాలను పూజ సందర్భంగా సమర్పిస్తే చాలు ఆయన  కరుణ లభిస్తుంది.  


Friday 1 March 2019

రియల్ హీరో


పది టేకులు తీసుకొని  నటిస్తూ  కోట్లాది రూపాయలను వెనకేసుకొనేవాడు  కాదు హీరో.    దేశంకోసం తన ప్రాణాలను అర్పించదానికి  కూడా వెనుకాడని వైమానికదళ  వింగ్ కమాండర్ అభినందన్ రియల్ హీరో. ఇలాంటివారికి పాలాభిషేకం చేయండి.  పూలమాలలు వేయండి  దేశం గర్విస్తుంది.