అవినీతి అంటే కేవలం
లంచం తీసుకోవడమే కాదు. మన విధులను,
బాధ్యతలను సక్రమంగా  నిర్వర్తించకపోవడం, విధులకు సమయానికి హాజరు కాకపోవడం, సమయానికన్నా
ముందే ఆఫీస్ నుండి వెళ్లి పోవడం, ట్రాఫిక్ నిబంధనలు  పాటించకపోవటం,  విద్యుత్‌ను
అక్రమంగా వాడటం,  బస్సులో, రైళ్లలో టికెట్ లేకుండా ప్రయా ణించడం,  ఇంట్లోని మురికి
నీటిని రోడ్లమీదకు వదిలి వేయటం. ఇంట్లోని చెత్తను
మురికి కాలువలలో పడేయడం, రోడ్డును ఆక్రమించుకొని ఇంటిని నిర్మించుకోవడం,  ఫంక్షన్‌ల పేరుతో
రోడ్లపైన  టెంట్లు వేసి, రహదారిపై
రాకపోకలకు అంతరాయం కలిగించడం వంటివి కూడా
అవినీతిలో భాగాలేనని గుర్తించాలి. 


 
