”శోధిని”

Friday 24 December 2021

క్రిస్మస్ శుభాకాంక్షలు !

 

దైవత్వం మానవత్వంలోకి ప్రవేశించిన రోజు క్రిస్మస్. 'ఒక మామూలు మనిషిగా సాటి మనిషిని ప్రేమించమని' ఏసుక్రీస్తు చెప్పాడు. 'నువ్వు నీపట్ల ఎలా శ్రద్ద తీసుకుంటావో అదేవిధంగా ఇతరుల పట్ల వ్యవహరించు, పొరుగువారిని ప్రేమించు' అన్నాడు. కానీ, నేడు ఆలా జరగడం లేదు. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. నీతి, నిజాయితీగా ఉంటూ మన మనసును పవిత్రంగా ఉంచుకున్నప్పుడే దేవుడు మనలో ప్రవేశిస్తాడు. అయన ఆశీస్సులు, ఆశ్వీర్వాదం మనకు లభిస్తాయి.





Saturday 4 September 2021

ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు !

 

లక్షలాది మంది అధ్యాపకుల ఆదర్శమూర్తి  డా.సర్వేపల్లి రాధాకృష్టన్ గారు  ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించి  అంచెలంచెలుగా ఎదిగి దేశ అధ్యక్ష పదవికిచేరుకున్న మహానుభావుడు.  దేశానికి అత్యున్నత స్థానాన్ని ఒక విద్యావేత్త అధిరోహించడం ఉపాధ్యాయులందరికీ గర్వకారణం.  గురువులందరికీ ఆదర్శప్రాయుడయిన డా. సర్వేపల్లి గారి జన్మదినం నేడు.  ఈ సందర్భంగా అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి జ్ఞానం అనే వెలుగును పంచే గురువులందరికీ అభినందనలు...శుభాకాంక్షలు! 



Thursday 27 May 2021

నేడు NTR జయంతి !


                                                        ఆ చిరునవ్వులో ... 
చెదరని విశ్వాసం 
ఆ వినయంలో ... 
ఆకట్టుకునే ఆధిక్యత 
కోట్లాదిమంది హృదయాలలో 
సుస్థిరస్థానం సంపాదించుకున్న
 NTR  జయంతి నేడు!

మన జాగ్రత్తలే మనకు రక్ష


Thursday 13 May 2021

రంజాన్ శుభాకాంక్షలు!

శుభాలు కురిపించే శుభప్రదమైన రంజాన్ మాసంలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది హృదయంలో భక్తిభావం ఉప్పొంగుతుంది.   మనసు, తనువూ తన్మయత్వంతో పులకించి పోతుంది.   ఈ పవిత్ర మాసంలోనే ఖురాన్ గ్రంధం అవతరించడంతో  ఈ గ్రంధం సమస్త మానవాళికి మార్గదర్శిని అయ్యింది.  అందుకే రంజాన్ మాసం పవిత్రం, పుణ్యదాయకం. శుభాల సిరులు అందించే రంజాన్ పర్వదినం అందరికీ సకల శుభాలను అందించాలని కోరుకుంటూ.. రంజాన్ శుభాకాంక్షలు!


అప్రమత్తత లేకుంటే ముప్పే !



Wednesday 10 March 2021

మహా శివరాత్రి శుభాకాంక్షలు!

శివుడు లింగరూపంలో ఉద్భవించిన పుణ్యదినం మహా శివరాత్రి.  మంగళకరమైన మహా శివరాత్రి నాడు శివునికి అభిషేకం, పగలు ఉపవాసం, రాత్రి జాగారణ చేసి భక్తితో కొలిచిన వారికి అనంతమైన పుణ్య ఫలాలు, సకల శుభాలు కలుగుతాయని చెబుతారు.  అహంభావాన్ని వదలి, అహంకారాన్ని వీడి అందరిని సమభావంతో ప్రేమిస్తే శివుని కరుణాకటాక్షం తప్పక లభిస్తుంది.  'ఓం నమశ్శివాయ' అనే పంచాక్షరీ మంత్రం అజ్ఞానంధకారాన్ని పోగొట్టి మోక్షానిస్తుంది. పర్వదినాన అందరికి శంకరుని అనుగ్రహం లభించాలని కోరుకుందాం.