శివుడు లింగరూపంలో ఉద్భవించిన పుణ్యదినం మహా శివరాత్రి. మంగళకరమైన మహా శివరాత్రి నాడు శివునికి అభిషేకం, పగలు ఉపవాసం, రాత్రి జాగారణ చేసి భక్తితో కొలిచిన వారికి అనంతమైన పుణ్య ఫలాలు, సకల శుభాలు కలుగుతాయని చెబుతారు. అహంభావాన్ని వదలి, అహంకారాన్ని వీడి అందరిని సమభావంతో ప్రేమిస్తే శివుని కరుణాకటాక్షం తప్పక లభిస్తుంది. 'ఓం నమశ్శివాయ' అనే పంచాక్షరీ మంత్రం అజ్ఞానంధకారాన్ని పోగొట్టి మోక్షానిస్తుంది. ఈ పర్వదినాన అందరికి శంకరుని అనుగ్రహం లభించాలని కోరుకుందాం.
No comments:
Post a Comment