”శోధిని”

Monday 10 February 2014

చిన్న సినిమా... హిట్ సినిమా!

సినిమా అంటే వినోద సాధనం.  వినోదాన్ని అందించడమే ప్రధాన ధ్యేయం .  సందేశాన్ని ఇవ్వడం తర్వాతి విషయం.  ముందుగా హాస్యం అలరిస్తేనే ... ఆ తర్వాతే సందేశమైనా ప్రేక్షకులకు చేరుతుంది.  విభిన్న వర్గాల వారిని ఆకట్టు కుంటుంది.  మంచి సినిమా అంటే ఎ ఒక్క వర్గానికో, అభిమానుల కోసమో కాకుండా అందరినీ ఆకట్టుకునేలా వుండాలి. సున్నితమైన హాస్యం... శ్రావ్యమైన సంభాషణలు ...ఎప్పటికీ మరువలేని మళ్ళీ మళ్ళీ వినాలన్పించే  పాటలు ఉండాలి.  కథ కమనీయంగా ... దృశ్యాలు రమణీయంగా ఉంటే, అది మంచి సినిమా అవుతుంది.  అలాంటి సినిమాలు నేడు కాగడా పట్టి వెతికినా కనిపించవు.  మొదటి వారం 20 కోట్లు వాసులు చేసింది...  ఇదే గొప్ప చిత్రం అనే రోజులొచ్చాయి.  అదే సినిమా నాలుగో వారంలో ఎంత వసూల్ చేసిందో చెప్పరు.  నేడు నాలుగో వారంలో కుడా ప్రేక్షకులను దియేటర్ కి రప్పించే సినిమానే హిట్ సినిమా.  ఈ అవకాశం పెద్ద సినిమాలకు ఎలాగు లేదు.  ఆ దమ్ము తక్కువ బడ్జెట్ తో నిర్మిస్తున్న చిన్న సినిమాలకు వుంది.  అందుకే చిన్న సినిమాలను ప్రేక్షకులను అలరిస్తున్నాయి.  ఆ చిత్రాలు విజయం వైపు దూసుకు వెళ్తున్నాయి.