”శోధిని”

Monday 8 July 2013

మహా నటి సావిత్రి

తెలుగులో గొప్ప చిత్రం ఏదని ఎవరినైనా అడిగితే వెంటనే చెప్పేది 'మాయా బజార్' అని.  అలాగే తెలుగులో గొప్ప నటి ఎవరని అడిగితే 'మహా నటి సావిత్రి' అని ఎవరైనా చెబుతారు.  తెలుగు ప్రేక్షకుల మనుసులను, హృదయాలను తన నటనతో ఆకట్టుకున్న ఎకైక నటి సావిత్రి.  ఆప్యాయతతో కూడిన ఆహ్లాదమైన చిరునవ్వు ఆమె సొంతం.  వాత్సల్యంతో నిండిన అనురాగ పూర్వకమైన కల్మషం లేని పలకరింపు ఆమె సహజ గుణం,  ఆర్థ్రత , ఆప్యాయత కురిపించే పాత్రలను ఆమె నల్లేరు మీద బండిలా పోషించి మెప్పించారు.  కేవలం ముఖ కవళికల ఆధారంగా ప్రేక్షకులను మంత్రం ముగ్దుల్ని చేయడం ఆమె సొత్తు.  కంటి చూపుతో కోటి భావాలను పలికించే సావిత్రి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.  ఆమె నటించిన చిత్రాలన్నీ అసలు సిసలైన మేలిమి రత్నాలు. 


అమ్మాయిలూ... జాగ్రత్త!

నేడు అమ్మాయిలు అన్ని రంగాలలో మంచి తెలివి తేటలు ప్రదర్శిస్తున్నారు. అబ్బాయిలతో సమానంగా రాణిస్తున్నారు.  ఇది శుభ పరిణామం.  కాని, ప్రేమ దగ్గరకొచ్చేసరికి  పప్పులో కాలేస్తున్నారు.  చచ్చు పుచ్చు కబుర్లు చెప్పే అబ్బాయిల చేతుల్లో చాలా మంది అమ్మాయిలు మోసపోతున్నారు.  మగాడి ఆలోచనా విధానం వేరని గ్రహించలేక పోతున్నారు.  ప్రేమ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇలా జరుగుతోంది. అమాయకంగా ప్రేమంటూ   అబ్బాయిల చేతిలో బలవుతున్నారు.  ఇలా మోసపోయే అమ్మాయిలు  వున్నత వరకూ  మోసం చేసే అబ్బాయిలు పుడుతూనే ఉంటారు.అమ్మాయిలూ భ్రమలోంచి బయట పడండి... బాగా ఆలోచించి చక్కని భవిష్యత్తును నిర్మించుకోండి. మోసగాళ్ళ మాయమాటలు విని మోసపోకండి.  మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటుందని మరచిపోకండి. మీ తెలివితేటలు ఉపయోగించి మంచి తోడును ఎన్నుకోండి.