”శోధిని”

Saturday 12 October 2013

మా నాయకులకు జ్ఞానోదయం కలిగించు తల్లీ!

 
'అమ్మా' అని ఆర్తిగా పిలిచినవారిని అక్కున చేర్చుకునే జగజ్జననీ... దారితప్పి తిరుగుతున్నరాష్ట్ర రాజకీయనాయకులకు సరైన దారి చూపించు.  తమ పదవులకోసం రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న నాయకుల కళ్ళు తెరిపించు.  ఒకప్పుడు అభివృద్ధిలో ప్రధమ స్థానంలో ఉన్న  రాష్ట్రం, ఇప్పుడు చిత్తసుద్ధి లేని నాయకుల వలన అభివృద్దిలో కుంటుపడింది.  ఐక్యమత్యమే మహాబలం అనే విషయాన్ని మా నాయకులకు భోదించి, స్వార్థపూరిత రాజకీయ బుద్దిని విడనాడేటట్లు చూడు తల్లీ. ఒకరి పైన ఒకరు బురద చల్లుకోకుండా వారిలోని గర్వం, అహంకారం, ఇర్ష్య, అసూయ లాంటి శత్రువులను రూపుమాపి, ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా చేయి భవానీ.   మా నాయకులకు జ్ఞానోదయం కలిగించి, మా మనస్సులలోని అశాంతిని తొలగించి ప్రశాంతతను ప్రసాదించు విశ్వ మాతా!

మిత్రులందరికీ ....విజయదశమి శుభాకాంక్షలు!