”శోధిని”

Thursday 28 February 2013

అపార్ట్ మెంట్ సంస్కృతి



ఫ్లాట్లేమో పెద్దగా
దగ్గరగా ఉంటాయి
అందులో నివసించే
మనుషులేమో
చాలా దూరంగా వుంటారు
మనిషిని మనిషి
దాటేసుకు పోతున్నా...
పలకరింపులు అసలు ఉండవు
అనుబందాలు, ఆత్మీయతలు
మచ్చుకైన కనిపించవు
ఆప్యాయతలు,అనురాగాలు
మనుషుల మధ్య కరువయ్యాయి
ఎవరి పనుల్లో వాళ్ళు ...
కలివిడిలేని హడావిడి
మనక్షేమం కోరేవారే
మనబంధువులని,
ఆప్యాయత కనబరచే వారే...
మన ఆత్మబంధువులని
తెలుసుకున్న నాడే
మసకబారిని మానవ సంబంధాలు
మళ్ళీ చిగురిస్తాయి.
వెన్నెలను పండిస్తాయి.






Monday 25 February 2013

అర్థాంగి














నీ బాగు కోసం 
కర్పూరమై కరిగేది 
నీ పురోగతిని చూసి 
దివ్వెలా వెలిగేది 
నీ అర్థాంగి!
ప్రేమగా చూస్తే...  
అవుతుంది నీకు తల్లి 
వేధిస్తే ... 
అవుతుంది భద్రకాళి!! 

Saturday 23 February 2013

నిఘా వైఫల్యం

నెత్తుటి దాహంతో
ఉగ్రవాదం...
భయం గుప్పిట్లో
ప్రజల ప్రాణం...
ప్రాణాలు తోడేస్తున్న
నిఘా వైఫల్యం!




ఐకమత్యం!


కాకుల్ని చూస్తే 
తెలుస్తుంది 
ఐకమత్యం 
అంటే ఏమిటో...!
చీమల్ని చూస్తే 
తెలుస్తుంది 
సమైఖ్యత 
అంటే ఏమిటో...!! 


Wednesday 20 February 2013

నేటి పరిస్థితి!



ప్రశ్నించడం...  
మరచిపోయాం... 
నిలదీయడం...  
మానేశాం... 
ప్రతిదానికి...  
తలవంచడం... 
నేర్చుకున్నాం...  
అందుకే నాయకులు 
నిత్యం  మోసం 
చేస్తూనే ఉన్నారు 
ఇదీ నేటి పరిస్థితి! 


Sunday 17 February 2013



వికసించిన పుస్పానివి నువ్వు ...
విరజిమ్మే పరిమళాన్ని నేను! 
విరిసే అనురాగం నువ్వు... 
కురిసే మమకారాన్ని నేను! 
మురిపించే రాగానివి నువ్వు... 
మైమరపించే భావాన్ని నేను! 
ప్రేమను పంచే ప్రాణానివి నువ్వు... 
అభిమానాన్ని పంచే అపురుపాన్ని నేను! 
అనురాగాల సన్నిధి నువ్వు...
ఆప్యాయతల పెన్నిధి నేను !
నీ ప్రేమ కోరుతుంది త్యాగాన్ని... 
నా ప్రేమ ఆశించదు ఏ ప్రతిఫలాన్ని! 







Friday 15 February 2013

హాస్యం-అపహాస్యం

         'నబూతే నభవిస్యత్'   ఓ తెలుగు సినిమాలో హాస్య నటి వ్యంగ్యంగా చెప్పిన డైలాగ్ ఇది.  ఈ బూతు డైలాగ్ ను  థియేటర్స్ లో విని  ప్రేక్షకులు పడి  పడి  నవ్వేసారు.  అప్పటి నుంచి తెలుగు సినిమాలలో నీతి  కంటే బూతుకే పెద్ద పట  వేయడం మొదలయింది.  హాస్యమంటే బూతు డైలాగ్ లేనని మన సినీపెద్దల నమ్మకం.  హాస్య నటీనటులు వెగటు పదాలను పలకడానికే  కేరాఫ్ గా మారారంటే అతిశయోక్తి కాదు.  అదే హస్యమని  భావించడం  ప్రేక్షకుల
దౌర్భాగ్యం.  అంతే  కాకుండా హిందూ సమాజం పైన. హిందూ ఆచార సంప్రదాయాల పైన వ్యంగ్యాస్త్రాలు, పాటలు, మాటలు నానాటికి శృతిమించి పోతున్నాయి.

        హాస్యమంటే వెకిలి చేష్టలు, రెండర్థాల మాటలు, అవహేళన చేయడం కాదని, ఎవరి మనసు నొప్పించక అన్ని వయసుల వారినీ, అన్ని వర్గాల వారిని కదుపుబ్బ నవ్వించేలా ఉండాలని సినీ దర్శక,నిర్మాతలు తెలుసుకుని  హాస్యాన్ని అపహాస్యం కాకుండా చూడాలి.

Tuesday 12 February 2013

ప్రేమను ప్రేమించు...ప్రేమను బ్రతికించు!




ప్రతి జీవితానికి ప్రేమ ఒక దివ్య ఔషదం లాంటిది. అందుకే ఈ ప్రపంచంలో ప్రేమను కోరుకోని ప్రాణి అంటూ ఉండదంటే అతిశయోక్తి కాదు.   పావురాళ్ళు ఒక్కసారి జతకడితే జీవితమంతా తమ బంధాన్ని కొనసాగిస్తాయి.  అలాంటి ప్రేమ అతిమధురంగా ఉంటుంది.  జున్నులా మెత్తగా హృదయాన్ని హత్తుకునే ఆత్మీయ భావంలా ఉంటుంది.  ఎలాంటి స్వార్థం లేకుండా జీవితాంతం పవిత్రంగా తోడుగా నిలుస్తుంది...మనసును ఆహ్లాదపరుస్తుంది.  మదిలో ఉత్తేజాన్ని, నూతనోత్సాహాన్ని నింపుతుంది. దాంతో ఆత్మీయత పెరిగి రెండు మనసులు దగ్గరవుతాయి.  ఒకరి అభిప్రాయాలు మరొకరు స్వేచ్చగా, నిర్మొహమాటంగా చెప్పుకునే అవకాశం కలుగుతుంది.  జీవితం ఆనందమయం అవుతుంది.  మనుషుల మద్య ప్రేమ అనేది లేకుంటే భవిష్యత్తు శూన్యం అనిపిస్తుంది.  జీవితం అందకారమనిపిస్తుంది.  ఈ భూమ్మీద మనుషులు ఉన్నంత కాలం ప్రేమ బతికే వుంటుంది.  పువ్వులో దాగి వుంది మకరందం...ప్రేమలో దాగి వుంది అనుబంధం.  ప్రేమను ప్రేమించు... ప్రేమను బ్రతికించు.

Sunday 3 February 2013

స్నేహ భావం...!

          కులమతాలు మనిషి పెట్టిన అడ్డుగోడలు.  కులాలు వృత్తుల ఆధారంగా ఏర్పడితే, మతాలు మనుషులు మధ్యలో నిర్మించుకున్నారు.  కులాలు, మతాలు  అనేవి మనిషిని మంచి మార్గంలో నడిపించడానికి ఉపయోగపడే మంచి సాధనాలు.  మనం చేయవలసిందల్లా వాటి ఆధారంగా మనలోని మానవత్వాన్ని పెంచుకోవాలి.  తోటి మనిషిని ప్రేమించడం నేర్చుకోవాలి.  అంతేకాని కులాల పేరుతో, మతాల పేరుతో పోట్లాడుకోకూడదు.  అందరు స్నేహ భావంతో మెలగాలి.  మనుషుల మధ్య ఆప్యాయతలు,పలకరింపులు విరబూయాలి.  మనుషులంతా ఒక్కటేనని, అందరిని సమభావంతో చూడటం నేర్చుకోవాలి.  కులం కంటే మనసు గొప్పదని ...మతం కన్నా గుణం ముఖ్యమని తెలుసుకోవాలి.