”శోధిని”

Thursday 4 January 2018

బలవంతపు కాన్పులు

                                                                           

నవమాసాలు మోసి కాన్పు కష్టమయ్యే సమయంలో అత్యవసర పరిస్థితులలో మాత్రమే ఆపరేషన్ చేసి శిశువును బయటికి తీస్తారు.  కాని. నేడు అలా జరగడం లేదు.  నవమాసాలు నిండక ముందే నక్షత్రం. రాసి, ఘడియలు చూసి బలవంతంగా అమ్మ కడుపును చీల్చి,  బిడ్డను బయటికి తీస్తున్నారు.  మూడనమ్మకాలతో ప్రజలు, డబ్బు కోసం వైద్యులు ఇలాంటి ప్రసవాలను చేస్తున్నారు.  ఇలాంటి కాన్పులు అన్ని ఆసుపత్రులలో మాములయిపోయాయి. మూడనమ్మకాలతో తమకు నచ్చిన విధంగా బిడ్డ ప్రాణాలను పణంగా పెట్టి  ఇలాంటి ప్రసవాలకు పాల్పడుతున్నారు.  సైన్స్ ఎంతగా అభివృద్ధి చెందుతున్నా ముహుర్తాలని, గ్రహాలని,  మూడనమ్మకాలవైపు ప్రజలు పరుగెడుతూనే ఉన్నారు.  మంచి నక్షత్రంలో పుడితే మహాజాతకుడు అవుతారనే గుడ్డి నమ్మకం ప్రజలల్లో పోవాలి.  సహజంగా జరగాల్సిన ప్రసవాన్ని ముహూర్తం చూసి కాన్పులు చేయించడం మంచిది కాదు.  గతంలో సహజంగా పుట్టినవారికి జాతకనక్షత్రం చూసేవారు.  కానీ, నేడు ముందుగానే జాతక నక్షత్రాలు చూసుకుని బిడ్డకు జన్మనివ్వడం విడ్డూరం. జనవరి 1న ఇలాంటి బలవంతపు కాన్పులు వేల సంఖ్యలో జరిగినట్టు జరిగినట్టు తెలుస్తోంది.