”శోధిని”

Saturday 20 July 2013

శాకంబరీదేవి

 

అందాల రాక్షసి !



అందాల నటి అనుష్క ప్రస్తుతం మూడు భారీ చిత్రాలలో నటిస్తోంది.  ఈ మూడు చిత్రాలలోనూ అరివీర భంకర పోరాట పటిమను కనపరుస్తోందట. గుణశేఖర్ దర్శకత్వంలో 'రాణి రుద్రమదేవి', రాజమౌళి దర్శకత్వంలో 'బాహుబలి', సెల్వరాఘవన్ దర్శకత్వంలో తమిళ అనువాద చిత్రం 'వర్ణ' లో నటిస్తోంది.  ఈ మూడు చిత్రాలలో గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం, ఫైట్స్  చేస్తోందట.  'రాణి రుద్రమదేవి' చిత్రంలో ఆమె కత్తి పట్టి యుద్ధం చేస్తుంటే  ఫైట్స్ మాస్టర్స్ ఆచర్యపోతున్నారట.  ఈ సినిమా కోసం పన్నెండు కేజీలు బరువు తగ్గి బాగా స్లిమ్ గా తయారయింది.  ఎలాగు యోగా టీచర్ కాబట్టి ప్రత్యేక  ఆసనాలు వేస్తూ నాజుగ్గా  అయింది.  'రాణి రుద్రమదేవి' చిత్రంలో ఓ సరికొత్త అనుష్క మనకు కనిపించబోతోంది.    ఈ మూడు సినిమాల కోసం ఎప్పుడూ లేని విధంగా కష్టపడుతోంది.  కష్టానికి ప్రతిఫలంగా పారితోషికం కుడా హీరోలతో సమానంగా రెండు కోట్లకు పెంచిందట. ఇదే నిజమైతే దక్షిణాన అత్యధిక పారితోషికం అందుకుంటున్న కథానాయికలలో అనుష్క దే మెదటి స్థానం అవుతుంది. 
అందాల రాక్షసి