
కార్మికుల చేత పశువుల్లా పనిచేయించకుండా పని గంటలు నిర్ణయించమని 'చికాగో' నగరంలో కార్మికులంతా సమ్మె చేసి విజయం సాధించారు. ప్రపంచానికి శ్రమ విలువను చాటి చెప్పి,శ్రమజీవుల బ్రతుకులలో వెలుగు నింపారు. అప్పటి నుంచి కార్మిక శక్తికి ప్రతిరూపమైన మే 1న ప్రపంచ కార్మిక దినోత్సవం జరుపుకుంటున్నాము. కానీ, ఈనాడు ప్రభుత్వ కార్యాలయాలలోతప్ప ప్రైవేటు కర్మాగారాలలో మాత్రం ఇప్పటికి కార్మికుల చేత పశువుల్లా పని చేయించుకుంటున్నారు.అదేవిధంగా బాలకార్మికులచేత వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. ప్రభుత్వం ఎన్నిచట్టాలు తెచ్చినా ప్రతి రంగంలోనూ బాలకార్మికులు కనబడుతున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం గట్టి చట్టాలు తెచ్చి, బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిషేదించాలి. వారిచేత చేయించుకున్న ఉత్పత్తులను నిషేదించాలి. దేశంలో పేరుకు పెద్ద కంపెనీలుగా చెలామణి అవుతున్న కార్పోరేట్ సంస్థలు కార్మికులను పీల్చి పిప్పి చేస్తున్నాయి. ఈ సంస్థలలో పనిచేసే కార్మికులకు కంటినిండా నిద్రలేక, సమయానికి తిండి లేక ఆరోగ్యాలను పాడుచేసుకుంటున్నారు. ఎక్కవ జీతానికి ఆశపడి కార్పోరేట్ సంస్థల కబంధహస్తాలలో ఎందరో కార్మికులు చిక్కుకొని రోదిస్తున్నారు. ఇలాంటి కార్మికుల జీవితాలలో వెలుగును నింపిన రోజే నిజమైన ప్రపంచ కార్మిక దినోత్సవం.
4 comments:
Good Information.
May Day.. subhakaankshalu.
నాకు తెలియని విషయం తెలియచెప్పారు. "కార్మికుల చేత పశువుల్లా పనిచేయించకుండా పని గంటలు నిర్ణయించమని 'చికాగో' నగరంలో కార్మికులంతా సమ్మె చేసి విజయం సాధించారు. " నిజమేనండి, ఈ ఇక్కడ కూడ రోజుకి నేను ఒక్కోసారి 18 గంటలు పని చేసిన రోజులు కూడా ఉన్నాయి. "బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిషేదించాలి" ఇది తప్పక అమలుపరచాలండి. అసలు బాలలందరు స్కూల్ కి తప్పక వెళ్ళాలని ఒక చట్టం తేవాలి (ఉందా?) .క్లుప్తం గా చెప్పాల్సిన నాలుగు మాటలు చక్కగా చెపుతారు నాగేంద్ర గారు మీరు.
థాంక్స్....వనజ గారు!
మీ స్పందనకి ధన్యవాదాలు వెన్నెల గారు!
Post a Comment