”శోధిని”

Saturday, 5 May 2012

సుకుమార గంధర్వులు



మధ్య 'టీవీ టాలెంట్ షోలు' పాటకు పెద్ద పీట వేస్తున్నాయి.   పోగ్రాం వస్తుందంటే చాలు పిల్లలు, పెద్దలు సమయానికి టీవీ ముందు వాలిపోతున్నారు. చిన్నారులు తన్మయంగా తనివితీరా పాడుతుంటే, మది పులకించి పోతుంది.  వాళ్ళ అద్భుతమైన గాత్రం, పాడే అభినయం చూస్తుంటే మనసు  పరవళ్ళు తొక్కుతుంది. కొత్త గాయకులకు టాలెంట్ షోలు  ఒక వేదికై నిలిచిందని చెప్పవచ్చు.  టీవీ షోలు పాటకు పెద్ద పీట వేయడంతో కొత్త గాయనీగాయకులకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి...  ఇది శుభ పరిణామం. టాలెంట్ షోలు హంగామా పెరిగాక  సంగీతం నేర్చుకోవాలన్న ఉత్సాహం బాల బాలికలలో మరింతగా పెరిగింది.  తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను గాయకులుగా తీర్చి దిద్దడానికి ఎక్కువ  మక్కువ చూపిస్తున్నారు. సుకుమార గంధర్వులు ఒకరు పాడుతుంటే వెన్నెల విరబూసినట్టు... మరొకరు పాడుతుంటే జలపాతం ఉరికినట్టు... ఇంకొకరు పాడుతుంటే మాయూరం నర్తించినట్టు...మరో చిన్నారి పాడుతుంటే వసంతరుతువులో కోయిలమ్మ పాడినట్టు అనిపిస్తుంది.   చిన్నారులకు మంచి మంచి అవకాశాలు వచ్చి  వీరి గాత్రంతో  ప్రేక్షకులను పరవళ్ళు తోక్కించాలని మనసార కోరుకుందాం

2 comments:

జలతారు వెన్నెల said...

నాగేంద్ర గారు,నిజంగా వాళ్ళు గంధర్వులేనండి. నేను "పాడుతా తీయగా", "సూపర్ సింగెర్" తప్పకుండా follow అవుతూ ఉంటాను. అసలు చిన్న వయసులోనే అంత చక్కగా ఎలా పాడగలుగుతున్నరో అని నేను చాలా ఆశ్చర్య పోతాను. మీరన్నట్టు ఈ ప్రొగ్రాంస్ వలన సంగీతం నేర్చుకుంటున్న వారి సంఖ్య పెరిగింది. తల్లి తండ్రులు కూడా చదువుతో పాటు పిల్లల దగ్గర టాలెంట్ ని కనిపెట్టి ప్రోత్సహించడం హర్షనీయం. మంచి పోస్ట్ . ధన్యవాదాలు మీకు.

కాయల నాగేంద్ర said...

ధన్యవాదాలు వెన్నెల గారు!