ఇతరుల బాధ్యతను తనమీద వేసుకుని నడిపించే వాడే నాయకుడు. అటువంటి నాయకుడు ఎందరికో మార్గదర్శకుడవుతాడు. నేడు నాయకత్వ లక్షణాలు ఏ మాత్రం లేని చాలా మంది నాయకుకుగా చెలామణి అవుతున్నారు. సమస్యలు ఎదురవగానే ఆవేశంతో ఊగిపోయే వారు నాయకులు కాలేరు. నాయకుడికి ఆత్మ నిగ్రహం అవసరం. దురదృష్టవశాత్తు ప్రభుత్వ ఆస్తులను ద్వంసం చేయడం నేడు నాయకత్వ లక్షణాలుగా చెలామణి అవుతున్నాయి. రోడ్ల పైన ప్రదర్శించిన ఈ విధ్వంసకర ప్రవర్తన దిగజారుడు నాయకత్వానికి నిదర్శనం అని చెప్పవచ్చు. ఇలాంటి నాయకులు కాదు మనకి కావాల్సింది. భిన్నంగా ఆలోచిస్తూ...మంచి ప్రవర్తన కలిగి హుందాగా ప్రదర్శించగలిగిన నాయకత్వం అవసరం. ఆలోచనల్లో దార్శనీకత మాటల్లో సూటిదనం, నిర్ణయాల్లో పరిపక్వత, చర్చల్లో మేధావితనం వంటి లక్షణాలు వున్న వ్యక్తి విలక్షణ నాయకుడవుతాడు. నిస్వార్థ సేవతో అసమాన ప్రతిభ కనబరిచి, మంచి నాయకునిగా గుర్తింపు పొందుతాడు.
Thursday, 30 April 2015
మంచి నాయకుడు అంటే ...

చేపల పులుసు ! (జోక్)
కొత్తగా పెళ్లయిన భార్యతో ...
"నీకు చేపల పులుసు చేయడం తెలుసా " అడిగాడు.
"ఓ ..బాగా చేయగలను" ఉత్సాహంగా అంది.
"అయితే ఈ చేపల్కి బాగా మసాల పట్టించి వండు చూద్దాం"
చేపల కూర చేసి భర్తకు వడ్డించింది ఆ ఇల్లాలు
తొలిసారిగా భార్య చేతి వంట రుచి చూస్తూ ...
"ఏంటీ కూర నీసు వాసన వస్తోంది. చేపల్ని కడగలేదా ?" ముఖం అదోలా పెట్టి అడిగాడు.
"చేపలు ఎప్పుడూ నీళ్ళల్లోనే కదా ఉండేది.... ఇక వాటిని కడిగేది ఎందుకు ?
ఆమె సమాధానం.
భార్య తెలివిని ఎలా మెచ్చుకోవాలో తెలీక జుట్టు పీక్కున్నాడు ఆ భర్త గారు!

Subscribe to:
Posts (Atom)