కొన్ని ప్రశ్నలు అడిగాక, "ఇంతకు ముందు ఎక్కడయినా చేసిన అనుభవం ఉందా?" అడిగాడు ఇంటర్వ్యు అధికారి అయోమయం.
"బోలెడు అనుభవం వుంది సార్!"
"అయతే ఎక్కడక్కడ పని చేసావో వివరంగా చెప్పు "
"ఎలిమెంటరీ స్కూల్లో అయిదేళ్ళు... హైస్కూల్లో అయిదేళ్ళు ... జూనియర్ కాలేజీలో రెండేళ్ళు ... ఇంజినీరింగ్ కాలేజీలో నాలుగేళ్ళు... మొత్తం పదహారేళ్ళు సార్"
"అదికాదయ్యా పని చేసిన అనుభవం"
"ఇప్పుడు మీరు ఉద్యోగం ఇస్తే అనుభవం దానంతట అదే వస్తుంది సార్!"
తను చెప్పేదాంట్లో నిజం వుందని గ్రహించి తరుణ్ ని ఎంపిక చేశాడు అయోమయం.