Thursday, 27 July 2017
Saturday, 22 July 2017
ప్రమాదంలో దేశ యువత
క్షణికానందం కోసం ఎందరో యువతీయువకులు తమ నిండు జీవితాల్ని బుగ్గిపాలు చేసుకుంటున్నారు. మాదక పదార్థాలకు బానిసలైన వారి జీవితాలు చీకటి బతుకులేనని గ్రహించాలి. దేశంలో పాతుకుపోయిన డ్రగ్స్ మాఫియాను సమూలంగా నాశనం చేయడానికి ప్రభుత్వానికి సహకరించినప్పుడే యువత భవిష్యత్తును కాపాడినవారవుతారు. విద్యార్థులు మత్తు వైపు కాకుండా లక్ష్యం వైపు అడుగులు వేయాలి.
Thursday, 13 July 2017
"చెట్టు... జీవకోటికి ఆయువు పట్టు"
సర్వ జీవకోటికి ఆయువుపట్టు అయిన చెట్లను నరకడం ఆపి, మొక్కలను నాటడం అలవాటు చేసుకోవాలి. పరిసరాలన్నింటిని పచ్చని చెట్లు నాటితే, భూమాత చల్లగా ఉంటుంది. నాటిన చెట్లను సంరక్షిస్తే, కోట్ల వృక్షాలు పుట్టుకొస్తాయి. దీంతో వర్షాలు పుష్కలంగా కురుస్తాయి. పచ్చదనం మీదే ప్రపంచం ఆధారపడివుందన్న విషయం మరవద్దు. పచ్చదనం అంటే హడాహుడిగా మొక్కలను నాటి, ఆ తర్వాత వాటి సంరక్షణను మరచిపోవడం కాదు. మొక్కలను నాటడంపై ఉన్న శ్రద్ధ పోషణలో కనిపించాలి.
Wednesday, 5 July 2017
Subscribe to:
Posts (Atom)