”శోధిని”

Monday 12 November 2012

దీపం... 'లక్ష్మీ దేవి' ప్రతిరూపం!


        మన ముఖ్య పండుగలలో  దీపావళి ఒకటి. కుల మతాలకు అతీతంగా జరుపుకునే ఈ పండుగ భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచిస్తుంది.  పండుగలన్నీ సూర్యోదయంతో మొదలయితే,  దీపావళి మాత్రం సుర్యాస్తమయంతో మొదలవుతుంది.  ఇంటిల్లిపాదీ పిల్లలు, పెద్దలు అందరూ  కలసి ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ.

        దీపావళి రోజు లక్ష్మీ పూజ ప్రధానం.  అజ్ఞానాన్ని పారద్రోలే సాక్షాత్తు లక్ష్మీదేవి అని, దీపం వున్నా చోట జ్ఞాన సంపద ఉంటుందంటారు.  అందుకే ఈ రోజున లక్ష్మీదేవిని  భక్తి శ్రద్దలతో పూజిస్తే సర్వ సంపదలు సిద్దించి, సర్వ శుభాలు కలుగుతాయంటారు.  అంతే కాకుండా లక్ష్మీ సహస్ర నామాలతో లక్ష్మీ దేవిని ఆరాధించడం వల్ల  లక్ష్మీ సంపన్నురాలై, అష్టైశ్వర్యాలను ఇస్తుందని ప్రజల విశ్వాసం.

        అమావాస్య చీకట్లను పారద్రోలే  దీపం లక్ష్మీ దేవి ప్రతిరూపం.  అందుకే దీపాలను తోరణాలుగా అమర్చి ఐశ్వర్య లక్ష్మీని పుజిస్తారు.  ఈ రోజున టపాసులను కాలిస్తే, మానవ జీవితాలలో వెలుగులు విరజిమ్ముతాయని నమ్ముతారు.  అయితే టపాసులను పేల్చడంలో ప్రమాదాలకు తావు లేకుండా  తగు జాగ్రత్తలు పాటించాలి.  పెద్దలు, పిల్లల దగ్గరుండి  టపాసులను కాల్పించాలి.  

        మిత్రులందరికీ ...దీపావళి శుభాకాంక్షలు!