”శోధిని”

Monday 12 November 2012

దీపం... 'లక్ష్మీ దేవి' ప్రతిరూపం!


        మన ముఖ్య పండుగలలో  దీపావళి ఒకటి. కుల మతాలకు అతీతంగా జరుపుకునే ఈ పండుగ భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచిస్తుంది.  పండుగలన్నీ సూర్యోదయంతో మొదలయితే,  దీపావళి మాత్రం సుర్యాస్తమయంతో మొదలవుతుంది.  ఇంటిల్లిపాదీ పిల్లలు, పెద్దలు అందరూ  కలసి ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ.

        దీపావళి రోజు లక్ష్మీ పూజ ప్రధానం.  అజ్ఞానాన్ని పారద్రోలే సాక్షాత్తు లక్ష్మీదేవి అని, దీపం వున్నా చోట జ్ఞాన సంపద ఉంటుందంటారు.  అందుకే ఈ రోజున లక్ష్మీదేవిని  భక్తి శ్రద్దలతో పూజిస్తే సర్వ సంపదలు సిద్దించి, సర్వ శుభాలు కలుగుతాయంటారు.  అంతే కాకుండా లక్ష్మీ సహస్ర నామాలతో లక్ష్మీ దేవిని ఆరాధించడం వల్ల  లక్ష్మీ సంపన్నురాలై, అష్టైశ్వర్యాలను ఇస్తుందని ప్రజల విశ్వాసం.

        అమావాస్య చీకట్లను పారద్రోలే  దీపం లక్ష్మీ దేవి ప్రతిరూపం.  అందుకే దీపాలను తోరణాలుగా అమర్చి ఐశ్వర్య లక్ష్మీని పుజిస్తారు.  ఈ రోజున టపాసులను కాలిస్తే, మానవ జీవితాలలో వెలుగులు విరజిమ్ముతాయని నమ్ముతారు.  అయితే టపాసులను పేల్చడంలో ప్రమాదాలకు తావు లేకుండా  తగు జాగ్రత్తలు పాటించాలి.  పెద్దలు, పిల్లల దగ్గరుండి  టపాసులను కాల్పించాలి.  

        మిత్రులందరికీ ...దీపావళి శుభాకాంక్షలు!

12 comments:

Unknown said...

మీకూ మా దీపావళి శుభాకాంక్షలు!

రాజ్యలక్ష్మి.N said...

మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు..

శ్రీ said...

మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు...@శ్రీ

కాయల నాగేంద్ర said...

మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు!

కాయల నాగేంద్ర said...

మీకూ దీపావళి శుభాకాంక్షలు!

కాయల నాగేంద్ర said...

మీకూ దీపావళి శుభాకాంక్షలు!

హనుమంత రావు said...

లక్ష్మీ ప్రదంగా ఉంది మీ తెలుగు వెన్నెల.. మీకూ మీ కుటుంబములోనివారికీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.. నా బ్లాగు చూసి అభినందించిన మీ అభిమానానికి కృతజ్ఞతలు..

కాయల నాగేంద్ర said...

ధన్యవాదాలు హనుమంత రావు గారు!

తెలుగు వారి బ్లాగులు said...

హలో అండీ !!

''తెలుగు వారి బ్లాగులు'' తరుఫున మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు !!

వెలుగు జిలుగుల దీపావళి నాడు ఆ లక్ష్మీ మాత కటాక్షం
ఈ యావత్ భారతావనిలో ప్రతి ఒక్కరికీ కలగాలని ఆశిస్తూ ...
ఒక చిన్న విన్నపము ....!!

రాబోయే నెల డిసెంబర్ 2 వ ఆది వారము (తెలుగు బ్లాగుల దినోత్సవం) లోపల ఒక వెయ్యి తెలుగు బ్లాగులను ఒకదరికి చేర్చాలని సంకల్పించటమైనది

మీరు అనుమతించి నట్లైతే మీ బ్లాగును కూడా తెలుగు వారి బ్లాగుల సముదాయం లో జతపరిచేదము.
మీ అంగీకారము తెలుపగలరు

http://teluguvariblogs.blogspot.in/

సుభ/subha said...

దీపావళి శుభాకాంక్షలండీ..

కాయల నాగేంద్ర said...

ధన్యవాదాలు...మీకూ దీపావళి శుభాకాంక్షలు!

కాయల నాగేంద్ర said...

ధన్యవాదాలు! మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు!!
నా బ్లాగును కూడా 'తెలుగు వారి బ్లాగుల సముదాయం' లో జతచేయగలరు.