అహంకారం, మొండితనం, మూర్ఖత్వం ఇవి తీవ్రమైన మనోరుగ్మతలు. మనిషిలో అహంభావం ఉన్నంతవరకు ఎవరినీ ప్రేమించలేరు. అహంవల్ల ఎదుటివారు తన కన్నా తక్కువవారిగా కనిపిస్తారు. స్వార్థబుద్ధి వెంటాడుటం వల్ల నీచమైన అలవాటు మనసులో చోటుచేసుకుంటుంది. అలా కాకుండా ఉండాలంటే, అహంకారపూరిత మాటలకు, చేతలకు దూరంగా ఉంటూ, మనసును మల్లెపువ్వులా మలచుకోవాలి. 'నేను' అనే అహంకారానికి, 'నాది' అనే మమకారానికి స్వస్తి పలకాలి.