చిటపట చినుకులు పడుతుంటే...
పుడమితల్లి పులకించింది
మేనుపై జాలువారే చినుకులకు
ఆమె మనసు పరవశించింది
చల్లగా వీచే చిరుగాలికి
ఆమె మయూరమై నర్తించింది
ఆమె అణువణువునా అలజడి
ఆమె చూపుల్లో వలపు జడి
ఆమె ఆధరాలపై చిరుజల్లు
ఆమె చిరు నగవులో హరివిల్లు
ఆమె ప్రతి కదలికలోనూ కోమలం
మైమరపించే అందాల సౌందర్యం!