శివరాత్రి అంటే మంగళకరమైన రాత్రి. అందుకే ఈ శుభకరమైన శివరాత్రి రోజున ఉపవాసం ఉంటూ జాగారం చేస్తే ఆ పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుందని భక్తుల నమ్మకం. అయితే కేవలం ఉపవాసం ఉంటూ జాగారం చేస్తే సరిపొదు. అనుక్షణం 'ఓం నమశ్శివాయ' అనే శివపంచాక్షరి మంత్రాన్ని పటిస్తూ... మనసును పవిత్రంగా, ప్రశాంతంగా ఉంచుకోవాలి. మనసులో నేనే గొప్ప అనే అహంకారాన్ని పెట్టుకుని ఎన్ని పూజలు చేసినా ఫలితం ఉండదు. అహంభావాన్ని వదలి, అహంకారాన్ని వీడి అందరిని సమభావంతో ప్రేమిస్తే శివుని కరుణాకటాక్షం తప్పక లభిస్తుంది. ఈ శివరాత్రి పర్వదినాన ప్రజలందరికి శంకరుని అనుగ్రహం లభించాలని కోరుకుందాం.