![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEg5xtPC_hXY_iJDl2Fb7ZCxWbAlmVqsQ78kTFoO7VXHOMTeIelGENlBfDSmfcRm4hEb1DvI6EHrPYyTTntvmB83xSA0LPYf8oPjgFda3KZSC-FmL_UEJZl_jm8-5hl6Ur7zTsVgr62MfUU/s400/download.jpg)
తెలుగు మాసాలలో కార్తిక మాసం ఎంతో పవిత్రమైనది. ఈ మాసంలో శివునికి చేసే పూజకి కొండంత ఫలం లభిస్తుంది భక్తుల నమ్మకం. కార్తిక మాసంలో శివుడికి అభిషేకములు, మారేడుదళాలు సమర్పించినా శివ కటాక్షం లభిస్తుందంటారు. ఈ మాసంలో కార్తిక స్నానం, తులసి పూజ, శివకేశవుల స్తోత్ర పారాయణం, పూర్ణిమ, ఏకాదశులలో చేసే శ్రీ సత్యనారాయణ వ్రతం అత్యంత శుభఫలాలు ఇస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.