రంజాన్ పేరు వినగానే హృదయంలో భక్తిభావం ఉప్పొంగుతుంది. సమస్త శుభాలతో ఆధ్యాత్మిక సౌరభాలు గుబాళిస్తాయి. ఈ మాసమంతా ముస్లిం సోదరీసోదరులకు అత్యంత పవిత్రమైనది కాబట్టి ఈ పండుగకు ఇంతటి గౌరవం, పవిత్రత. నెల రోజులపాటు పవిత్ర ఉపవాసాలు ఆచరిస్తూ... ఎంతో దీక్షతో వీనులవిందుగా ఖురాన్ పారాయణ చేస్తారు. అనాధులకు, ఆర్తులకు దానధర్మాలు చేస్తారు. మాసంలో చివరి రోజున ఉపవాసాలు ముగించి ఆనందం విరిసిన హృదయంతో రంజాన్ పండుగను అత్యంత వైభవంగా, ఆనందోత్సాహాలతో శోభాయమానంగా జరుపుకుంటారు. ఇఫ్తార్ విందుకు ఇతరులను ఆహ్వానించి సమైఖ్యతను, మతసామరస్యాన్ని చాటుకుంటారు.
రంజాన్ పర్వదిన శుభసందర్భంగా...మిత్రులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు !