అల్లా కోరిక మేరకు తన ముద్దుల కుమారుడిని బాలి ఇవ్వడానికి పూనుకొని, కొడుకు మెడ పైన కత్తి పెట్టగానే ఆకాశం నుంచి ఓ ధ్వని వచ్చి 'నీ భక్తికి, త్యాగానికి నేను ముగ్ధున్నయ్యాను.... అందుకే నీ కొడుకు స్థానంలో పొట్టేలు బలి అయ్యింది. మీ తండ్రీకొడుకుల త్యాగానికి ప్రతి సంవత్సరం జిల్ హజా మాసంలో ఆర్థికంగా బాగున్న ముస్లింలు తమ సంపాదనతోనే జంతువులను కొని బలివ్వాలి. అలా బలి అయిన జంతువు మాంసాన్ని మూడు భాగాలుగా చేసి, ఒక భాగం తన కుటుంబం కోసం, రెండో భాగాన్ని బంధువుల కోసం, మూడో భాగం పేదలకోసం సమానంగా పంచాలి' అని సూచిస్తాడు. ఇలా తండ్రీకొడుకుల త్యాగానికి ప్రతీకగా ముస్లింలు 'బక్రీద్' పర్వదినాన్ని జరుపుకుంటారు. ముస్లిం సోదర సోదరీమణులకు 'బక్రీద్' పర్వదిన శుభాకాంక్షలు.