శ్రీ మహా విష్ణువు జన్మ నక్షత్రం మైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో వ్రతాలు, పూజలు ఆచరించడం ఎంతో శుభకరమని మన పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా చంద్రుడు శ్రవణా నక్షత్రంలో సంచరించే మాసం కావడంతో శ్రావణ మాసంగా పాచుర్యం పొందింది. ఈ మాసం ముఖ్యంగా మహిళలకు ఎంతో సౌభాగ్యప్రదం. ఈ నెలంతా ప్రతి ఇంటా ఆధ్యాత్మిక సుమాల గుబాళింపులే దర్శనమిస్తాయి. శ్రావణ మాసంలో మంగళ, శుక్రవారాలలో అమ్మవారిని భక్తిశ్రద్దలతో నిండు మనసుతో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ వరలక్ష్మి వ్రతం మహిళలందరికీ మంగలప్రదమైనది...ఎంతో శుభదాయకమైనది.
No comments:
Post a Comment