కార్పోరేట్ సంస్థలలో పనిచేస్తున్న ఏంతోమంది కార్మికులు కంటినిండా నిద్రలేక, సమయానికి తిండి లేక ఆరోగ్యాలను పాడుచేసుకుంటున్నారు. నిరుద్యోగ సమస్యతో సతమతమవుతూ కనీస వేతనాలకు నోచుకోక కార్పోరేట్ సంస్థల కబంధహస్తాలలో చిక్కుకొన్నారు. ఇదే అదునుగా చేసుకొని కార్పోరేట్ సంస్థలు పని గంటలు పెంచుతూ కార్మికులను పీల్చి పిప్పి చేస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనాలు చాలా సంస్థలు ఇవ్వడం లేదు. ప్రభుత్వాలు కార్పోరేట్ సంస్థలకు కొన్ని నిబంధనలు విధించి, అవి పాటించేలా చర్యలు తీసుకోవాలి. శ్రమ విలువను చాటి చెప్పి శ్రమజీవుల జీవితాలలో వెలుగులు నింపాలి.
మేడే శుభాకాంక్షలు!
మేడే శుభాకాంక్షలు!
No comments:
Post a Comment