దేవిశరన్నవరాత్రులలో ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ బతుకమ్మ పండుగ. అసమానతలను ఎదురిద్దాం...ఆత్మగౌరవంతో బతుకుదాం అంటూ ఆడపడుచులు ఉత్సాహంగా , ఆనందంగా ఎంతో సంబరంగా ఈ పండుగను జరుపుకుంటారు. ముత్తయిదువులంతా గౌరీదేవి దీవెనలను కోరుతూ... తమ మాంగల్య సౌభాగ్యం చల్లగా ఉండాలని ప్రార్థిస్తే, యువతులు తమకు మంచి భర్త లభించి, దాంపత్య జీవనం సుఖసంతోషాలతో సాగాలని వేడుకుంటారు. బతుకమ్మ పండుగ వచ్చే సమయానికి చెట్లు ఆకులతో అల్లుకుపోతాయి. భూమి పచ్చదనం పర్చుకుంటుంది. బతుకమ్మను తయారుచేసే తంగేడు, మునుగు, బంతి, చామంతి, గన్నేరు, జిల్లేడు, తామర, గుమ్మడి, గడ్డి పువ్వులు లాంటి రంగురంగుల పూలు వికసిస్తాయి. కుల, మతాలకతీతంగా వాడవాడలో జరుపుకునే బతుకమ్మ పండుగ ముఖ్య ఉద్దేశం ప్రకృతిని, మహిళలను గౌరవించాలని.
No comments:
Post a Comment