”శోధిని”

Tuesday 30 October 2012

అమ్మాయి నవ్వులు... అందమైన పువ్వులు!



         అమ్మాయి నవ్వితే మనకో పండుగ.  ఆమె నడుస్తుంటే మనకో సంబరం.  అమ్మాయి కనపడగానే మనసంతా ఉల్లాసం. కానీ, అమ్మాయి పుట్టిందంటే మాత్రం ఇంటిల్లిపాదీ ఉస్సూరంటుంది. దేశం అభివృద్ధి పథంలో పయనిస్తున్నా ... స్త్రీలు  రాష్ట్రాలను, దేశాన్ని ఏలుతున్నా ...ఆడపిల్లల పట్ల వివక్షాత్మక ధోరణి ముదురుతున్నడం  నిజంగా మన దౌర్భాగ్యం.  ఆడపిల్ల అమ్మ కడుపులో వుందని తెలియగానే అక్కడే ఛిద్రమై పోతోంది. ఇలా  ఆడపిల్లలను పొట్టన పెట్టుకునే ధారుణమైన  చరిత్ర పెద్ద పెద్ద ఇళ్ళల్లో, బాగా చుదువుకున్న వారిలో జరగడం బాధాకరం.  ఎక్కడ స్త్రీ ఉంటుందో అక్కడ పవిత్రత వుంటుంది.  వారి నవ్వులోనే వుంటుంది కమ్మనైన ప్రపంచం. స్త్రీలు అన్ని రంగాలలో ముందున్నట్లే, పురుషులతో సమానంగా ఎదగనివ్వాలి.  దేశంలో ఆడ, మగ సంఖ్య సమానంగా ఉన్నప్పుడే దేశం అభివృద్ధి చెందటానికి వీలు  కలుగుతుంది.
        

Friday 26 October 2012

ముస్లిం సోదరీసోదరులకు శుభాకాంక్షలు!


        ప్రతి పండుగ వెనుక ఒక సందేశం దాగి వుంటుంది.  అలాంటి సందేశాత్మక పండుగలల్లో  ముస్లింలు త్యాగానికి ప్రతీతగా భక్తీ భావంతో జరుపుకునే పండుగ బక్రీద్.  ఈ సందర్భంగా ముస్లిం సోదరీసోదరులకు నా హృదయపూర్వక  శుభాకాంక్షలు!

Thursday 25 October 2012

మూగజీవులు...మనపిల్లలే!

ప్రకృతి లోని ప్రతి ప్రాణి  అవసరం మరో ప్రాణికి వుంటుంది.  కాబట్టి ప్రతి జీవిని రక్షించుకోవాలి.  జీవకోటిలో ఎ ఒక్కటి అంతరించినా, అదిమొత్తం జీవావరణపైన ప్రతికూల ప్రభావం చూపుతుంది. పచ్చదనాన్నికాపాడుకుంటూ, జీవులను రక్షించుకుంటేనే మనుగడ సాధ్యం.  అందుకే మాగజీవులను మన కన్నా బిడ్డల్లా చూసుకుంటాం.  వాటిని పరిరక్షించుకునే బాధ్యత తీసుకుందాం. వాటిని చంపడం మాని, పెంచడం నేర్చుకుందాం!


Tuesday 23 October 2012

విజయదశమి శుభాకాంక్షలు!


       తొమ్మిది రోజుల తొమ్మిది రూపాలలో దర్శనమిస్తూ భక్తులకు కనువిందు చేసిన దుర్గా దేవి, పదవ రోజు మహిషాసురుణ్ణి వదిస్తూ కన్పించే రూపం...మహిషాసురమర్ధిని రూపం. దుష్టసంహారం కోసం, దేవతలంతా తమతమ ఆయుధాలను దుర్గాదేవికి సమర్పిస్తారు.  వాటి సహాయంతో  పదిరోజులు మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధం చేసి, చివరి రోజు అత్యంత బలవంతుడయిన మహిషాసురుణ్ణి సంహరించి విజయం సాధించిన దుర్గా దేవిని భక్తులందరూ భక్తి శ్రద్ధలతో పూజించి పండుగ చేసుకుంటారు.  ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుండి దశమి వరకు దేవీ శరన్నవరాత్రులుగా జగన్మాత విశేష పూజలందుకుంటుంది.  ఆశ్వయుజ మాసంలోని శరన్నవరాత్రులు అమ్మవారిని ఆరాధిస్తే సకల శుభాలు ప్రాప్తిస్తాయి.  విజయదశమినాడు  ఆదిపరాశక్తిని భక్తి శ్రద్ధలతో పూజించి తల్లి అనుగ్రహంతో శక్తిసంపన్నలవుదాం.

విమి మీకు, మీ కుటుంభ్యుకు యురారోగ్య శ్వర్యాలు                        సిద్ధించాని శిస్తూ... విమి శుభాకాంక్షలు!

Monday 15 October 2012

శరన్నవరాత్రులు



           శరన్నవరాత్రులలో తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలలో ఆయా దేవిలను పూజిస్తారు.  ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి నైవేద్యంగా మొదటిరోజు (16-10-12) శ్రీ బాలా త్రిపురసుందరీ దేవికి పరమాన్నం, రొండో రోజు(17-1012) శ్రీ దేవి లలితాంబ అమ్మవారికి దద్దోజనం, మూడో రోజు(18-10-12) శ్రీ గాయత్రిమాతకి చక్రపొంగలి సమర్పిస్తారు. నాలుగో రోజు (19-10-12) శ్రీ అన్నపూర్ణా దేవికి పులగం, ఐదో రోజు (20-10-12)సరస్వతి దేవికి పులిహొర, ఆరోరోజు (21-10-12) శ్రీ మహాలక్ష్మి దేవికి  పెసరపప్పుతో చేసిన వంటకం, ఏడో రోజు (22-10-12) శ్రీ దుర్గామాతకి బెల్లంతో వండిన పదార్థాలు, ఎనిమిదో రోజు (23-10-12) శ్రీ మహిశాసురమర్దినికి గారెలు, తొమ్మిదో రోజు (24-10-12) శ్రీ రాజరాజేశ్వరీ దేవికి ఆరు రుచులతో కూడిన వంటలు సమర్పిస్తారు.

          ఈ తొమ్మిది రోజులు రకరకాల పూలతో అమ్మవారిని అలంకరిస్తారు. ముఖ్యంగా అమ్మవారికి ఎరుపు రంగు అంటే అమితమైన ఇష్టం.  అందుకే కుంకుమ పూజకు అంత విశిష్టత.  అలాగే ఎర్ర పూలన్న, ఎర్రని వస్త్రాలన్నఆమెకి ప్రీతి. అమ్మ వారికి అనేక నామాలున్నాయి.  గ్రామాలలో అయితే ఎల్లమ్మ, నూకాలమ్మ, బతుకమ్మ, పైడితల్లి అని, పట్టణాలలో అయితే బెజవాడ కనకదుర్గ, శ్రీ శైల భ్రమరాంబ, మధుర మీనాక్షి, కాశీ  విశాలాక్షి,  కంచి కామాక్షి, శృంగగిరి శారదాంబ అంటూ పిలుస్తారు.

          నవరాత్రులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో  పూజిస్తే  సర్వ మంగళాలు ప్రసాదించి, సంరక్షిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

          బ్లాగు మిత్రులందరికీ అమ్మ సంపూర్ణ అనుగ్రహం లభించాలని ప్రార్ధిస్తున్నాను.

    
 

Friday 12 October 2012

స్నేహబంధం...ఎంతో మధురం!


మచ్చలేని స్నేహం 
మల్లెపువ్వు లాంటిది 




స్నేహమనే తీయని పదం 
మల్లెల సుగంధ పరిమళం 

Sunday 7 October 2012

చెత్త సమస్య



          నగరాలలో రోజురోజుకు పెరిగిపోతున్న చెత్త కుప్పలతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు ఈ సమస్య మరింత తీవ్రతరం కానుంది.  ఇప్పటికే చెత్త వేయడానికి స్థలం దొరక మున్సిపల్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.  ప్రస్తుతం డంపింగ్ చేస్తోన్న స్థలాలు చెత్త చెదారంతో నిండి పోతున్నాయి.  ఈ పరిస్థితుల్లో చెత్తను ఎక్కడికి తరలించాలో తెలియక నివాస స్థలాల  మధ్యనే పడేస్తున్నారు.  వర్షాకాలం కావడంతో దోమలు, ఈగలు విలయతాండవం చేయడంతో పలువురికి అంటువ్యాధులు సోకుతున్నాయి.  చెత్త చెదారంతో  మురికి పేరుకుపోయిన  అపరిశుభ్రత కారణంగా ఈగలు ఆహార పదార్థాలను కలుషితం చేస్తున్నాయి.  చెత్త సమస్యకు పరిష్కారం కనుక్కోలేని పాలకులు రాష్ట్రాన్ని ఎలా ముందుకు  నడిపిస్తారో అర్థం కావడం లేదు.  ఇప్పటికైన ప్రభుత్వ అధికారులు చెత్తను సద్వినియోగం చేసుకునే మార్గాల కోసం అన్వేషించాలి.  చెత్తే కదా అని నిర్లక్షం చేస్తే కాలుష్యం కాటేయ్యడానికి సిద్ధంగా వుంది. మాయదారి మాయరోగాలు పొంచి వున్నాయని గ్రహించాలి. వెంటనే తగు చర్యలు తీసుకుని పర్యావరణాన్ని కాపాడాలి.  పారిశుద్ధ్య లోపం... ప్రజారోగ్యానికి శాపం కాకుండా చూడాలి.

Friday 5 October 2012

నాట్య మయూరి


ఇంద్ర ధనస్సులా...
హరివిల్లులా ...
పింఛము విప్పి 
నాట్యమాడింది మయూరి.
నూత నో త్సా హాన్నినింపుకుని,
ఆహ్వానం పలుకుతూ... 
మనసును ఆహ్లాదపరుస్తూ...
హృదయాన్ని గిలిగింతలు పెడుతూ ...


Monday 1 October 2012

గాంధీ జయంతి శుభాకాంక్షలు!



జాతిపిత మహాత్మాగాంధీ  జయంతి సందర్భంగా దేశంలో శాంతి, మతసామరస్యం నెలకొల్పేందుకు కృషి చేద్దాం!  గాంధీజీ చూపిన  బాటలో పయనిద్దాం!!
గాంధీ జయంతి శుభాకాంక్షలతో ...