తొమ్మిది రోజుల తొమ్మిది రూపాలలో దర్శనమిస్తూ భక్తులకు కనువిందు చేసిన దుర్గా దేవి, పదవ రోజు మహిషాసురుణ్ణి వదిస్తూ కన్పించే రూపం...మహిషాసురమర్ధిని రూపం. దుష్టసంహారం కోసం, దేవతలంతా తమతమ ఆయుధాలను దుర్గాదేవికి సమర్పిస్తారు. వాటి సహాయంతో పదిరోజులు మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధం చేసి, చివరి రోజు అత్యంత బలవంతుడయిన మహిషాసురుణ్ణి సంహరించి విజయం సాధించిన దుర్గా దేవిని భక్తులందరూ భక్తి శ్రద్ధలతో పూజించి పండుగ చేసుకుంటారు. ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుండి దశమి వరకు దేవీ శరన్నవరాత్రులుగా జగన్మాత విశేష పూజలందుకుంటుంది. ఆశ్వయుజ మాసంలోని శరన్నవరాత్రులు అమ్మవారిని ఆరాధిస్తే సకల శుభాలు ప్రాప్తిస్తాయి. విజయదశమినాడు ఆదిపరాశక్తిని భక్తి శ్రద్ధలతో పూజించి తల్లి అనుగ్రహంతో శక్తిసంపన్నలవుదాం.
ఈ విజయదశమి మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధించాలని ఆశిస్తూ... విజయదశమి శుభాకాంక్షలు!
ఈ విజయదశమి మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధించాలని ఆశిస్తూ... విజయదశమి శుభాకాంక్షలు!
5 comments:
మీకు కూడా విజయదశమి శుభాకాంక్షలండి నాగేంద్రగారు.
ధన్యవాదములు. మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు!
మీకు కూడా విజయదశమి శుభాకాంక్షలండి నాగేంద్రగారు...@sri
ధన్యవాదాలు. మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు!
ధన్యవాదాలు. మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు!
Post a Comment