”శోధిని”

Tuesday 30 October 2012

అమ్మాయి నవ్వులు... అందమైన పువ్వులు!



         అమ్మాయి నవ్వితే మనకో పండుగ.  ఆమె నడుస్తుంటే మనకో సంబరం.  అమ్మాయి కనపడగానే మనసంతా ఉల్లాసం. కానీ, అమ్మాయి పుట్టిందంటే మాత్రం ఇంటిల్లిపాదీ ఉస్సూరంటుంది. దేశం అభివృద్ధి పథంలో పయనిస్తున్నా ... స్త్రీలు  రాష్ట్రాలను, దేశాన్ని ఏలుతున్నా ...ఆడపిల్లల పట్ల వివక్షాత్మక ధోరణి ముదురుతున్నడం  నిజంగా మన దౌర్భాగ్యం.  ఆడపిల్ల అమ్మ కడుపులో వుందని తెలియగానే అక్కడే ఛిద్రమై పోతోంది. ఇలా  ఆడపిల్లలను పొట్టన పెట్టుకునే ధారుణమైన  చరిత్ర పెద్ద పెద్ద ఇళ్ళల్లో, బాగా చుదువుకున్న వారిలో జరగడం బాధాకరం.  ఎక్కడ స్త్రీ ఉంటుందో అక్కడ పవిత్రత వుంటుంది.  వారి నవ్వులోనే వుంటుంది కమ్మనైన ప్రపంచం. స్త్రీలు అన్ని రంగాలలో ముందున్నట్లే, పురుషులతో సమానంగా ఎదగనివ్వాలి.  దేశంలో ఆడ, మగ సంఖ్య సమానంగా ఉన్నప్పుడే దేశం అభివృద్ధి చెందటానికి వీలు  కలుగుతుంది.
        

6 comments:

శ్రీ said...

అవును నాగేంద్ర గారూ !
అమ్మయిలను కడుపులోనే వధించే రాజ్యాల్లో బీహార్ ఢిల్లీ ..ఇలా ఉత్తరాది రాజ్యాలు
ఎక్కువ వున్నాయి...
మీరు వ్రాసినది నిజం...భవిష్యత్తు తెలియక చేసే పనులు ఇవి...
మంచి పోస్ట్ నాగేంద్ర గారూ!...@శ్రీ

Bindu said...

మీరు చెప్పింది చాలా నిజం. కానీ ఇది ఎలా మారుతుందో అర్ధం కావటం లేదు!

కాయల నాగేంద్ర said...

మీ స్పందనకు ధన్యవాదాలు బిందు గారు!

కాయల నాగేంద్ర said...

మన ఆంద్రప్రదేశ్ కుడా తక్కువేమీ కాదు. ఇక్కడ బయటకి కనిపించకుండా జరిగిపోతున్నాయి. డాక్టర్స్ లో మార్పు రావాలి. పోస్ట్ నచ్చినందుకు ధన్యవాదాలు 'శ్రీ' గారు!

కావ్యాంజలి said...

చాలా బాగా చెప్పారు నాగేంద్ర గారు :)

కాయల నాగేంద్ర said...

మీ స్పందనకు ధన్యవాదాలు కావ్యాంజలి గారు!