”శోధిని”

Monday, 12 November 2012

దీపం... 'లక్ష్మీ దేవి' ప్రతిరూపం!


        మన ముఖ్య పండుగలలో  దీపావళి ఒకటి. కుల మతాలకు అతీతంగా జరుపుకునే ఈ పండుగ భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచిస్తుంది.  పండుగలన్నీ సూర్యోదయంతో మొదలయితే,  దీపావళి మాత్రం సుర్యాస్తమయంతో మొదలవుతుంది.  ఇంటిల్లిపాదీ పిల్లలు, పెద్దలు అందరూ  కలసి ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ.

        దీపావళి రోజు లక్ష్మీ పూజ ప్రధానం.  అజ్ఞానాన్ని పారద్రోలే సాక్షాత్తు లక్ష్మీదేవి అని, దీపం వున్నా చోట జ్ఞాన సంపద ఉంటుందంటారు.  అందుకే ఈ రోజున లక్ష్మీదేవిని  భక్తి శ్రద్దలతో పూజిస్తే సర్వ సంపదలు సిద్దించి, సర్వ శుభాలు కలుగుతాయంటారు.  అంతే కాకుండా లక్ష్మీ సహస్ర నామాలతో లక్ష్మీ దేవిని ఆరాధించడం వల్ల  లక్ష్మీ సంపన్నురాలై, అష్టైశ్వర్యాలను ఇస్తుందని ప్రజల విశ్వాసం.

        అమావాస్య చీకట్లను పారద్రోలే  దీపం లక్ష్మీ దేవి ప్రతిరూపం.  అందుకే దీపాలను తోరణాలుగా అమర్చి ఐశ్వర్య లక్ష్మీని పుజిస్తారు.  ఈ రోజున టపాసులను కాలిస్తే, మానవ జీవితాలలో వెలుగులు విరజిమ్ముతాయని నమ్ముతారు.  అయితే టపాసులను పేల్చడంలో ప్రమాదాలకు తావు లేకుండా  తగు జాగ్రత్తలు పాటించాలి.  పెద్దలు, పిల్లల దగ్గరుండి  టపాసులను కాల్పించాలి.  

        మిత్రులందరికీ ...దీపావళి శుభాకాంక్షలు!

Friday, 9 November 2012

ప్రేమను ప్రేమించు!



అమ్మ ప్రేమ అమృతం... 
నాన్న ప్రేమ మకరందం... 
భార్య ప్రేమ మమకారం... 
అక్క ప్రేమ అనురాగం... 
అన్న ప్రేమ ఆప్యాయత... 
చెల్లి ప్రేమ అపురూపం... 
తమ్ముడి ప్రేమ ఆహ్లాదం...                                                                                                                        
ప్రేమను ప్రేమించు!
ప్రేమకోసం జీవించు!!

Sunday, 4 November 2012

మకరందం!


జీవితం మనోహరమైన పుష్పం! 
అందులో 'ప్రేమ' నిరంతరం స్రవించే...
మధురమైన మకరందం!!

Saturday, 3 November 2012

స్పందన


              ఈనాడు ఈతరం నెట్

పువ్వులోని పరిమళం...
తుమ్మెదను ఆకర్షిస్తుంది.... 
జలపాతం లాంటి నీ సోయగం... 
మనసును రంజింపజేస్తుంది.

Tuesday, 30 October 2012

అమ్మాయి నవ్వులు... అందమైన పువ్వులు!



         అమ్మాయి నవ్వితే మనకో పండుగ.  ఆమె నడుస్తుంటే మనకో సంబరం.  అమ్మాయి కనపడగానే మనసంతా ఉల్లాసం. కానీ, అమ్మాయి పుట్టిందంటే మాత్రం ఇంటిల్లిపాదీ ఉస్సూరంటుంది. దేశం అభివృద్ధి పథంలో పయనిస్తున్నా ... స్త్రీలు  రాష్ట్రాలను, దేశాన్ని ఏలుతున్నా ...ఆడపిల్లల పట్ల వివక్షాత్మక ధోరణి ముదురుతున్నడం  నిజంగా మన దౌర్భాగ్యం.  ఆడపిల్ల అమ్మ కడుపులో వుందని తెలియగానే అక్కడే ఛిద్రమై పోతోంది. ఇలా  ఆడపిల్లలను పొట్టన పెట్టుకునే ధారుణమైన  చరిత్ర పెద్ద పెద్ద ఇళ్ళల్లో, బాగా చుదువుకున్న వారిలో జరగడం బాధాకరం.  ఎక్కడ స్త్రీ ఉంటుందో అక్కడ పవిత్రత వుంటుంది.  వారి నవ్వులోనే వుంటుంది కమ్మనైన ప్రపంచం. స్త్రీలు అన్ని రంగాలలో ముందున్నట్లే, పురుషులతో సమానంగా ఎదగనివ్వాలి.  దేశంలో ఆడ, మగ సంఖ్య సమానంగా ఉన్నప్పుడే దేశం అభివృద్ధి చెందటానికి వీలు  కలుగుతుంది.
        

Friday, 26 October 2012

ముస్లిం సోదరీసోదరులకు శుభాకాంక్షలు!


        ప్రతి పండుగ వెనుక ఒక సందేశం దాగి వుంటుంది.  అలాంటి సందేశాత్మక పండుగలల్లో  ముస్లింలు త్యాగానికి ప్రతీతగా భక్తీ భావంతో జరుపుకునే పండుగ బక్రీద్.  ఈ సందర్భంగా ముస్లిం సోదరీసోదరులకు నా హృదయపూర్వక  శుభాకాంక్షలు!