”శోధిని”

Saturday, 18 August 2012

తస్మాత్ జాగ్రత్త!



       ఆదివారం వచ్చిందంటే చాలు బయటకెళ్ళి భోంచేయడం చాలా మందికి అలవాటు.  హొటల్ పదార్థాలంటే లొట్ట లేసుకుని తినేస్తాము.  వాటి వాసనకే మైమరచి పోతాము.  కానీ, అవి తయారు చేసే వంట గదిని చూస్తే మాత్రం మరోసారి హొటల్ లోకి అడుగుపెట్టే సాహసం చేయం.  అంతటి దుర్భరమైన  స్థితి కనిపిస్తుంది అక్కడ.ఎంతో విశాలంగా అన్నీ హంగులతో కనిపించే డైనింగ్ హాల్ ఎంత అందంగా కనిపిస్తుందో, ఇరుకైన వంట గదిలో తిని పడేసిన ప్లేట్లు, గ్లాసులపై ఈగలు, బొద్దింకలు నిత్యం దర్శన మిస్తుంటాయి.  ఇక ఎలుకలు, పిల్లులు సరేసరి తయారయిన ఆహారపదార్థాలను ముందుగా అవి రుచి చూస్తుంటాయి.  మరోపక్క కుళ్ళిపోయిన కూరగాయలు వాసనలు గుభాలిస్తుంటాయి.  అంతటి అపరిశుభ్రమైన వాతావరణంలో మనం దర్శించే హొటల్ వంట గదులు ఉంటాయి. 

          వాస్తవానికి ఫుడ్ ఇన్సపెక్టర్స్ క్రమం తప్పకుండా హొటల్స్ ని  తనిఖీ చేయాల్సి ఉంటుంది.  కానీ, హొటల్ యజమానులు ఇచ్చే కాసులకు ఆశపడి అటువైపు వెళ్ళడం మానేశారు. ఫలితంగా కొన్ని హొటల్ యజమానులు నాసిరకం నూనె(కొన్ని రకాల జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనె), కుళ్ళిపోయిన కూరగాయలు (కూరగాయల షాప్ వాళ్ళు కుళ్ళిపోయిన కూరగాయలను వీళ్ళ కోసమే భద్రంగాదాచి ఉంచుతారు), రోజుల నిల్వ చేసిన పదార్థాలతో టిఫన్లను. భోజనాలను తయారు చేస్తున్నారు.  అలాంటి విషాన్ని చిమ్మే ఆహారాన్ని భుజించి, ఉచితంగా అనారోగ్యాన్ని తెచ్చుకుంటున్నాం
.
          హొటల్ కి వెళ్తున్నారా ... తస్మాత్ జాగ్రత్త!  

Tuesday, 14 August 2012

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు !



స్వాతంత్ర్య దినోత్సవం అనగానే మనకి గుర్తుకొచ్చేది మహాత్మా గాంధీ. అహింసాయుత మార్గంలో జాతిపిత బాపూజీ మన దేశానికి స్వేచ్చను అందించారు.  జాతి, కులం,మతం, ప్రాంతం అనే తేడాలనేవి లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందోత్సాలతో  జరుపుకునే స్వాతంత్ర్య  దినోత్సవం... ఎందరో వీరుల త్యాగఫలం.  ఆగస్టు 15 మన దేశ చరిత్రలో మరచిపోలేని  ఒక అపురూపమైన రోజు.  తెల్లదొరల నిరంకుశ పాలనకు తెరపడిన రోజు. మన దేశానికి విముక్తి లభించిన రోజు.స్వాతంత్ర్యం  సాదించడానికి కృషిచేసిన త్యాగమూర్తులను గుర్తుచేసుకుందాం... వారిని మన హృదయంలో నిలుపుకొని వందనం అర్పిస్తాం.  అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు !



Wednesday, 8 August 2012

శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు!



బ్లాగ్ మిత్రులందరికీ ....శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు!


Saturday, 4 August 2012

స్నేహబంధం... ఎంత మధురం!


మచ్చలేని స్నేహం అతిమధురంగా ఉంటుంది....
ప్రాణానికి ప్రాణమైన స్నేహం జీవితాంతం తోడుగా ఉంటుంది....
ఎలాంటి స్వార్థం లేని స్నేహబంధం జీవితాన్ని సుఖమయం చేస్తుంది!

Tuesday, 31 July 2012

యమదూతలు




      ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం అంటే మృత్యుశకటాలలో యమపురికి ప్రయాణం చేయడమే.  గత కొంత కాలంగా బస్సు ప్రమాదాలు చూస్తుంటే నిజమేనని పిస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయానించాలంటే అరచేతిలోప్రాణాలు పెట్టుకోవాల్సినదేనని ప్రస్ఫుటం చేస్తున్నాయి."ఆర్టీసీబస్సుల్లోప్రయాణించడంక్షేమకరం..సురక్షతప్రయాణంకోసంఆర్టీసీలోప్రయానించండి'  అంటూ ఢంకా బజాయించే ఆర్టీసీ యాజమాన్యం డ్రైవర్లను  కట్టడం చేయడంలోపూర్తిగావిఫలమవుతోంది. నిర్లక్షంగా డ్రైవింగ్ చేయడం, డ్రైవింగ్ చేస్తూ సెల్ మాట్లాడటం, బస్సును స్టేజీలలో ఆపక పోవడం వల్ల ఎక్కువ ప్రమాదాలుజరుగుతున్నాయి.  డ్రైవర్స్ దూకుడికి కొందరు  ప్రాణాలు పోగొట్టుకుంటే , మరికొందరు వికలాంగులుగా మారుతున్నారు. కొందరు డ్రైవర్స్ ట్రాఫిక్ సిగ్నల్ కూడా లెక్కచేయరు.  ప్రమాదాలు జరిగినప్పుడు సంఘటనా స్థలంలో బస్సును వదిలేసి పారిపోయి  యూనియన్లను ఆశ్రయించడం జరుగుతోంది. వెనుక ఆర్టీసీ బస్సు వస్తుందంటే ద్విచక్రవాహనదారులగుండెల్లోగుబులు మొదలయ్యే పరిస్థితి నెలకొంది. ఇలా అమాయక ప్రజలను పొట్టన పెట్టుకుంటున్న సంఘటనలు డ్రైవర్స్ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం. బస్సు  కదిలే సమయంలోనే  కొందరు డ్రైవర్స్  కావాలనే వేగం  పెంచడంతో చాలా మంది ప్రయాణికులు వెనుక చక్రాల కింద పడి మరణిస్తున్నారు. వీరిని ఆ యముడే భూలోకానికి 'యమదూతలు 'గా  పంపించినట్టుంది. ఇన్నిప్రమాదాలు జరుగుతున్నా  డ్రైవర్స్ లో కొంచమైన కరుణ, జాలి కనిపించదు . పైగా వాళ్ళ  ఇష్ట ప్రకారం బస్సును డ్రైవింగ్ చేస్తుంటారు . ఇలా ప్రమాదాలు జరుగుతుంటే, ఆర్టీసీ యాజమాన్యం దృష్టి పెట్టకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Saturday, 21 July 2012

తల్లిదండ్రులను గౌరవిద్దాం!



                నేడు  మానవుని మనసులో మార్పులోచ్చి , మనవ సంబంధాల స్థానంలో ఆర్ధిక సంబంధాలు వచ్చి చేరాయి.  ఈ పరిణామం వల్ల తల్లిదండ్రులను గౌరవించడం క్రమంగా తగ్గిపోయింది.  ఇంట్లో నుంచి పెద్దలకు గౌర మర్యాదలు దక్కడం లేదు.  కొందరు అయితే ఇంట్లో వేధింపులు తట్టుకోలేక ఉదయం నుంచి సాయంత్రం వరకు బయట గడిపి, ఏ రాత్రి వేళలో ఇంటికి చేరుకుంటున్నారు.  పెద్దలంటే గౌరవం, ప్రేమ ఈనాటి పిల్లలకు లేకుండా పోతోంది.  తనను పెంచి, పోషించి తను ఇంత కావడానికి కారణమైన తల్లిదండ్రులను అగౌరంగా  మాట్లాడటం నిజంగా సిగ్గు చేటు.  డబ్బున్న వాళ్ళు వృద్దాశ్రమంలో చేర్పిస్తే, డబ్బులేని  వాళ్ళు అనాదాశ్రామంలో వదిలేసి, తమ బాధ్యత తీరిందని భావిస్తున్నారు.  జన్మనిచ్చిన తల్లిదండ్రులను సంపాదనలో పడి నిర్లక్షం చేస్తున్నారు. మరికొందరు సంపాదన వేటలో పడి విదేశాలకు వెళుతూ తల్లిదండ్రులను ఒంటరిగా వదిలేస్తున్నారు. మనల్ని తల్లిదండ్రులు ఎంత ప్రేమగాచూసుకున్నారో, మనం వాళ్ళను అంతే ప్రేమగా చూడకపోయినా, కనీసం వాళ్ళ మనసు బాధ పడకుండా చూసుకోవడం మన బాధ్యత.  వారి అవసరాల్ని తీర్చడం, ఆప్యాయతను పంచడం మన ధర్మం.

Wednesday, 18 July 2012



18-07-2012 'ఈనాడు లేఖలు'  శీర్షికలో..