”శోధిని”

Saturday, 18 August 2012

తస్మాత్ జాగ్రత్త!



       ఆదివారం వచ్చిందంటే చాలు బయటకెళ్ళి భోంచేయడం చాలా మందికి అలవాటు.  హొటల్ పదార్థాలంటే లొట్ట లేసుకుని తినేస్తాము.  వాటి వాసనకే మైమరచి పోతాము.  కానీ, అవి తయారు చేసే వంట గదిని చూస్తే మాత్రం మరోసారి హొటల్ లోకి అడుగుపెట్టే సాహసం చేయం.  అంతటి దుర్భరమైన  స్థితి కనిపిస్తుంది అక్కడ.ఎంతో విశాలంగా అన్నీ హంగులతో కనిపించే డైనింగ్ హాల్ ఎంత అందంగా కనిపిస్తుందో, ఇరుకైన వంట గదిలో తిని పడేసిన ప్లేట్లు, గ్లాసులపై ఈగలు, బొద్దింకలు నిత్యం దర్శన మిస్తుంటాయి.  ఇక ఎలుకలు, పిల్లులు సరేసరి తయారయిన ఆహారపదార్థాలను ముందుగా అవి రుచి చూస్తుంటాయి.  మరోపక్క కుళ్ళిపోయిన కూరగాయలు వాసనలు గుభాలిస్తుంటాయి.  అంతటి అపరిశుభ్రమైన వాతావరణంలో మనం దర్శించే హొటల్ వంట గదులు ఉంటాయి. 

          వాస్తవానికి ఫుడ్ ఇన్సపెక్టర్స్ క్రమం తప్పకుండా హొటల్స్ ని  తనిఖీ చేయాల్సి ఉంటుంది.  కానీ, హొటల్ యజమానులు ఇచ్చే కాసులకు ఆశపడి అటువైపు వెళ్ళడం మానేశారు. ఫలితంగా కొన్ని హొటల్ యజమానులు నాసిరకం నూనె(కొన్ని రకాల జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనె), కుళ్ళిపోయిన కూరగాయలు (కూరగాయల షాప్ వాళ్ళు కుళ్ళిపోయిన కూరగాయలను వీళ్ళ కోసమే భద్రంగాదాచి ఉంచుతారు), రోజుల నిల్వ చేసిన పదార్థాలతో టిఫన్లను. భోజనాలను తయారు చేస్తున్నారు.  అలాంటి విషాన్ని చిమ్మే ఆహారాన్ని భుజించి, ఉచితంగా అనారోగ్యాన్ని తెచ్చుకుంటున్నాం
.
          హొటల్ కి వెళ్తున్నారా ... తస్మాత్ జాగ్రత్త!  

2 comments:

శ్రీ said...

నాగేంద్ర గారూ!
మీరు వ్రాసిన విషయాలు ఆలోచించ వలసినవే...
స్టార్ రేటింగ్ కూడా ఫుడ్ ఇనస్పెక్టర్ చెక్ చేస్తేనే ఇస్తారు...
కాని మన దేశంలో సరిగా పరిశీలించి ఇస్తారా? అన్నదే సందేహం...
మంచి అంశాన్ని చర్చించారు.
ఈ సండే ఎక్కడికి వెడుతున్నారు బైట డిన్నర్ కి?>>>..:-))..
అభినందనలు...
@శ్రీ

రవిశేఖర్ హృ(మ)ది లో said...

ఎంతో కాలం నుండి ఉన్న నా ఆవేదనను మీరు చక్కగా వ్రాసారు.అసలు ఈ దేశం లో food inspectors ఉన్నారా అని నాకు సందేహం.మన దేశం లో ప్రధాన సమస్య ఈ పరిసుభ్రత లేకపోవటమే! ఎన్ని జబ్బులు వస్తున్నాయండి.పట్టించుకోవాల్సిన పాలకులు అంతే !అనుభవించే ప్రజల్లో మార్పు రావాలండి.గుడ్ పోస్ట్.