అహం, అసూయ కలవారికి 'ఇగో' కుడా ఎక్కువే! వారు చెప్పేదే వేదంగా ... అందరూ పాటించాలని నిర్దేశిస్తారు. ఇలాంటి వాళ్ళు పలు సమస్యలను ఎదుర్కోవడమే కాకుండా చుట్టుప్రక్కల వారికి కుడా అనేక సమస్యలను తెచ్చి పెడుతుంటారు. అసూయా ద్వేశాలనేవి మానవ ప్రగతికి అడ్డుగోలగా నిలిచి మన అభివృద్ధికి అవరోధంగా మారతాయనే సత్యాన్ని గుర్తుంచుకోవాలి. అహంకారం విడిచిపెట్టి చూస్తే, చుట్టూ వున్న ఆనందం మనకు ఎంతో అందంగా కనిపిస్తుంది. అహంకారంతో వ్యవహరిస్తే మన చుట్టూవున్న వారి ప్రేమను కోల్పోవడం ఖాయం. అహంకారం మనిషిని పాతాలలొకానికి తొక్కేస్తుంది. అంతేకాకుండా సర్వరొగాలకు మూల కారణమవుతుంది. దీనివల్ల మనిషి అభద్రతా భావనకు లోనయ్యే అవకాశముంది. అలాకాకుండా ఉండాలంటే, ఆత్మపరిశీలనతో అసూయను అధికమించే ప్రయత్నం నిరంతరం కొనసాగించాలి. మనిషిలో స్వార్థం పెరిగితే దాని ద్వారా క్రూరత్వం కుడా పుట్టుకొస్తుంది. దాన్ని దూరం చేసుకోవాలంటే ముందుగా స్వార్థాన్ని విడనాడాలి. అప్పుడే మనసుకు ప్రశాంతత లభిస్తుంది. అందుకోసం ప్రతి ఒక్కరూ అహంకారాన్నిపూర్తిగా విడనాడాలి .... అసూయా ద్వేశాలకు చాలా దూరంగా ఉండాలి!
Sunday, 16 February 2014
అహంకారం ... అనేక అనర్థాలకు మూలకారణం !

Friday, 14 February 2014
Monday, 10 February 2014
చిన్న సినిమా... హిట్ సినిమా!
సినిమా అంటే వినోద సాధనం. వినోదాన్ని అందించడమే ప్రధాన ధ్యేయం . సందేశాన్ని ఇవ్వడం తర్వాతి విషయం. ముందుగా హాస్యం అలరిస్తేనే ... ఆ తర్వాతే సందేశమైనా ప్రేక్షకులకు చేరుతుంది. విభిన్న వర్గాల వారిని ఆకట్టు కుంటుంది. మంచి సినిమా అంటే ఎ ఒక్క వర్గానికో, అభిమానుల కోసమో కాకుండా అందరినీ ఆకట్టుకునేలా వుండాలి. సున్నితమైన హాస్యం... శ్రావ్యమైన సంభాషణలు ...ఎప్పటికీ మరువలేని మళ్ళీ మళ్ళీ వినాలన్పించే పాటలు ఉండాలి. కథ కమనీయంగా ... దృశ్యాలు రమణీయంగా ఉంటే, అది మంచి సినిమా అవుతుంది. అలాంటి సినిమాలు నేడు కాగడా పట్టి వెతికినా కనిపించవు. మొదటి వారం 20 కోట్లు వాసులు చేసింది... ఇదే గొప్ప చిత్రం అనే రోజులొచ్చాయి. అదే సినిమా నాలుగో వారంలో ఎంత వసూల్ చేసిందో చెప్పరు. నేడు నాలుగో వారంలో కుడా ప్రేక్షకులను దియేటర్ కి రప్పించే సినిమానే హిట్ సినిమా. ఈ అవకాశం పెద్ద సినిమాలకు ఎలాగు లేదు. ఆ దమ్ము తక్కువ బడ్జెట్ తో నిర్మిస్తున్న చిన్న సినిమాలకు వుంది. అందుకే చిన్న సినిమాలను ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఆ చిత్రాలు విజయం వైపు దూసుకు వెళ్తున్నాయి.
Sunday, 9 February 2014
Saturday, 8 February 2014
ప్రకృతి పరవశం!
జనవరి నెలలో ఉదయం లేవగానే మంచు కురుస్తూ ఉంటుంది. చెట్ల ఆకుల మీద... పంటపొలాల పైన ...పుష్పాల మీద ... గడ్డి పరకల పైన హిమబిందువులు ముత్యాల్లా అలరించాయి. నెల రోజుల పాటు మంచు బిందువుల స్పర్శకు ప్రకృతి పరవశించి పులకించి పోయింది. పరిసరాలన్నీ తన్మయత్వంతో మధురానుభూతులను తమలో పదిలంగా నింపుకున్నాయి. ప్రిబ్రవరి నెల రాగానే ఆ అద్భుత దృశ్య రూపం కనుమరుగవుతూ వస్తోంది. మళ్ళీ మనం ఈ అద్భుత దృశ్యాన్ని చూడాలన్నా... ఆస్వాదించాలన్నా ఏడాది వరకు ఆగాల్సిందే!
"గుడిసెలు లేని రాష్ట్రం!
"గుడిసెలు లేని రాష్ట్రం మన రాష్ట్రం" - ఈ మధ్య బస్సుల పైన ఈ ప్రకటన దర్శనమిచ్చింది. కానీ , వాస్తవానికి మన రాష్ట్రంలో లక్షల్లో ఇలాంటి గుడిసెలు కనపడతాయని ఆలస్యంగా తెలుసు కున్నారేమోగాని, ఈ ప్రకటనను కొద్ది మార్పులు చేసి మళ్ళీ ఇప్పుడు "గుడిసెలు లేని రాష్ట్రం ... అదే మన లక్ష్యం " అని ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రకటన మూడోసారి కూడా మారవచ్చు. ఎందుకంటే ఫుట్ ఫాత్ మీద నివాసముంటున్న ఎందరో నిరుపేదలకు కనీసం తలదాచుకోవడానికి గుడిసె కూడా లేదు పాపం
Thursday, 6 February 2014
నవ్వు... నవ్వించు!
పెనవేసుకుపోయిన బంధాలన్నీ వ్యక్తమయ్యేది పెదవుల పైన వికసించే చిరునవ్వుతొనే. మాటలతో చెప్పలేని భావాలెన్నో నవ్వులో పలికిస్తాం. హృదయాలను పులకింపచేస్తాం. నవ్వును అలవాటుగా మార్చుకుంటే, వ్యక్తిగత ఆందోళనలను అధికమించవచ్చు. మంచి దృక్పథానికి నవ్వుకు మించిన సాధనం మరొకటి ఉండదు. ఒకరు నవ్వే నవ్వు ఎదుటివారి సంతోషానికి కారణమవుతుంది. ఎక్కువగా నవ్వడం మొదలు పెడితే మన ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకున్నట్లే! ఆరోగ్య సమస్యలను సులువుగా పరిష్కరించుకోగల సామర్థ్యం పొందినట్లే!! 'హాస్యం' రోగాల బారినబారిన పడకుండా మనల్ని కాపాడే దివ్యౌషదం. నవ్వు సర్వరోగ నివారిణి. అందుకే ప్రతి ఒక్కరు హాస్యాన్ని ఆస్వాదించాలి... నిండు నూరేళ్ళు ఆనందంగా జీవించాలి.
Subscribe to:
Posts (Atom)