”శోధిని”

Thursday, 6 February 2014

నవ్వు... నవ్వించు!



పెనవేసుకుపోయిన బంధాలన్నీ వ్యక్తమయ్యేది పెదవుల పైన వికసించే చిరునవ్వుతొనే. మాటలతో చెప్పలేని భావాలెన్నో నవ్వులో పలికిస్తాం.  హృదయాలను పులకింపచేస్తాం.  నవ్వును అలవాటుగా మార్చుకుంటే, వ్యక్తిగత ఆందోళనలను అధికమించవచ్చు.  మంచి దృక్పథానికి నవ్వుకు మించిన సాధనం మరొకటి ఉండదు. ఒకరు నవ్వే నవ్వు ఎదుటివారి సంతోషానికి కారణమవుతుంది.  ఎక్కువగా నవ్వడం మొదలు పెడితే మన ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకున్నట్లే!  ఆరోగ్య సమస్యలను సులువుగా పరిష్కరించుకోగల సామర్థ్యం పొందినట్లే!! 'హాస్యం' రోగాల బారినబారిన పడకుండా మనల్ని కాపాడే దివ్యౌషదం.  నవ్వు సర్వరోగ నివారిణి.  అందుకే ప్రతి ఒక్కరు హాస్యాన్ని ఆస్వాదించాలి... నిండు నూరేళ్ళు ఆనందంగా జీవించాలి.  


5 comments:

పల్లా కొండల రావు said...

Exactly.

gajula sridevi said...

జంధ్యాలగారి పుణ్యమా అని నవ్వు నాలుగు విధాల చేటు అనే నానుడి నుండి నవ్వు నాలుగు విధాలా మేలు అనే వరకు వచ్చామంటే ...అది ఆయన చలవే.హాస్యాన్ని ఆస్వాదిద్దాం....ఆనందంగా , ఆరోగ్యంగా ఉందాం .

Meraj Fathima said...

అందుకే నేను హాస్య కథలు చదువుతాను, అప్ప్పుడప్పుడూ రాస్తాను కూడ,
ఇలా మీరూ పది కాలాలపాటు నవ్వుతూ ఉండాలని ఆశిస్తూ..

Zphs said...

nice writing

కాయల నాగేంద్ర said...

ధన్యవాదాలు పల్లా కొండల రావు గారు, శ్రీదేవి గాజుల గారు, మెరాజ్ ఫాతిమా గారు, ఉమా మద్దూరి గారు!