”శోధిని”

Saturday, 8 February 2014

ప్రకృతి పరవశం!

 
జనవరి నెలలో ఉదయం లేవగానే మంచు కురుస్తూ ఉంటుంది. చెట్ల ఆకుల మీద... పంటపొలాల పైన ...పుష్పాల మీద ... గడ్డి పరకల పైన హిమబిందువులు ముత్యాల్లా అలరించాయి.  నెల రోజుల పాటు మంచు బిందువుల స్పర్శకు ప్రకృతి పరవశించి పులకించి పోయింది.  పరిసరాలన్నీ తన్మయత్వంతో మధురానుభూతులను తమలో పదిలంగా నింపుకున్నాయి.  ప్రిబ్రవరి నెల రాగానే ఆ అద్భుత దృశ్య రూపం కనుమరుగవుతూ వస్తోంది.  మళ్ళీ మనం ఈ అద్భుత దృశ్యాన్ని చూడాలన్నా... ఆస్వాదించాలన్నా ఏడాది వరకు ఆగాల్సిందే!

"గుడిసెలు లేని రాష్ట్రం!


"గుడిసెలు లేని రాష్ట్రం మన రాష్ట్రం" - ఈ మధ్య  బస్సుల పైన ఈ ప్రకటన దర్శనమిచ్చింది.  కానీ , వాస్తవానికి మన రాష్ట్రంలో లక్షల్లో ఇలాంటి గుడిసెలు కనపడతాయని   ఆలస్యంగా తెలుసు కున్నారేమోగాని, ఈ ప్రకటనను కొద్ది మార్పులు చేసి మళ్ళీ ఇప్పుడు "గుడిసెలు లేని రాష్ట్రం ... అదే మన లక్ష్యం " అని ప్రచారం చేస్తున్నారు. ఈ  ప్రకటన మూడోసారి కూడా  మారవచ్చు.  ఎందుకంటే ఫుట్ ఫాత్ మీద నివాసముంటున్న ఎందరో నిరుపేదలకు కనీసం తలదాచుకోవడానికి గుడిసె కూడా లేదు పాపం 

Thursday, 6 February 2014

నవ్వు... నవ్వించు!



పెనవేసుకుపోయిన బంధాలన్నీ వ్యక్తమయ్యేది పెదవుల పైన వికసించే చిరునవ్వుతొనే. మాటలతో చెప్పలేని భావాలెన్నో నవ్వులో పలికిస్తాం.  హృదయాలను పులకింపచేస్తాం.  నవ్వును అలవాటుగా మార్చుకుంటే, వ్యక్తిగత ఆందోళనలను అధికమించవచ్చు.  మంచి దృక్పథానికి నవ్వుకు మించిన సాధనం మరొకటి ఉండదు. ఒకరు నవ్వే నవ్వు ఎదుటివారి సంతోషానికి కారణమవుతుంది.  ఎక్కువగా నవ్వడం మొదలు పెడితే మన ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకున్నట్లే!  ఆరోగ్య సమస్యలను సులువుగా పరిష్కరించుకోగల సామర్థ్యం పొందినట్లే!! 'హాస్యం' రోగాల బారినబారిన పడకుండా మనల్ని కాపాడే దివ్యౌషదం.  నవ్వు సర్వరోగ నివారిణి.  అందుకే ప్రతి ఒక్కరు హాస్యాన్ని ఆస్వాదించాలి... నిండు నూరేళ్ళు ఆనందంగా జీవించాలి.  


Tuesday, 4 February 2014

ముందు జాగ్రత్త!


టీవిలో సీరియల్స్ లేని  సమయంలో ఇద్దరు మహిళామణులు మాట్లాడుకుంటున్నారు-
మొదటి మహిళ : మా వారికి ముందు చూపు ఎక్కువ !
రెండో మహిళ     : అయితే బాగా పొదుపు చేస్తారన్నమాట!
మొదటి మహిళ : అంతలేదు ... నాతొ గొడవ మొదలవగానే ముందు                                                  జాగ్రత్తగా హెల్మెట్ పెట్టుకుంటాడు
రెండో మహిళ     : మా వారే నయం... నాకు కోపం తెప్పించకుండా ఇంటి                                             పనులన్నీ తనే  చేసిపెడతాడు.

Thursday, 30 January 2014

ప్రేమ పరిమళాలు!



ప్రకృతి సోయగాల్ని...   
హృదయపు లాలిత్యాన్ని...  
మేళవించిన నీ గానం 
మధురాతి మధురం! 
సౌకుమార్యంతో  కూడిన 
నీ తీయటి పలుకులు ...  
అత్యంత మనోహరం!! 
నీ రూపురేఖలు 
శిల్పకళా సంపదలు 
నా అణువణువులోనూ 
నీ సొగసులు, సోయగాలు...  
నా గుండె గుడిలో వెలసిన
ప్రేమ పరిమళాలు!  

Wednesday, 29 January 2014

వలపు బాణాలు...!


నీ నుదుటున వెలిసిన కనుబొమ్మలు...  
నిశీధిలో వెలిగే చంద్రోదయాలు...  
నీ వదనంలో మెరిసే  నయనాలు...  
మతిని పోగొట్టే వలపు బాణాలు...!