”శోధిని”

Friday, 12 October 2012

స్నేహబంధం...ఎంతో మధురం!


మచ్చలేని స్నేహం 
మల్లెపువ్వు లాంటిది 




స్నేహమనే తీయని పదం 
మల్లెల సుగంధ పరిమళం 

Sunday, 7 October 2012

చెత్త సమస్య



          నగరాలలో రోజురోజుకు పెరిగిపోతున్న చెత్త కుప్పలతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు ఈ సమస్య మరింత తీవ్రతరం కానుంది.  ఇప్పటికే చెత్త వేయడానికి స్థలం దొరక మున్సిపల్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.  ప్రస్తుతం డంపింగ్ చేస్తోన్న స్థలాలు చెత్త చెదారంతో నిండి పోతున్నాయి.  ఈ పరిస్థితుల్లో చెత్తను ఎక్కడికి తరలించాలో తెలియక నివాస స్థలాల  మధ్యనే పడేస్తున్నారు.  వర్షాకాలం కావడంతో దోమలు, ఈగలు విలయతాండవం చేయడంతో పలువురికి అంటువ్యాధులు సోకుతున్నాయి.  చెత్త చెదారంతో  మురికి పేరుకుపోయిన  అపరిశుభ్రత కారణంగా ఈగలు ఆహార పదార్థాలను కలుషితం చేస్తున్నాయి.  చెత్త సమస్యకు పరిష్కారం కనుక్కోలేని పాలకులు రాష్ట్రాన్ని ఎలా ముందుకు  నడిపిస్తారో అర్థం కావడం లేదు.  ఇప్పటికైన ప్రభుత్వ అధికారులు చెత్తను సద్వినియోగం చేసుకునే మార్గాల కోసం అన్వేషించాలి.  చెత్తే కదా అని నిర్లక్షం చేస్తే కాలుష్యం కాటేయ్యడానికి సిద్ధంగా వుంది. మాయదారి మాయరోగాలు పొంచి వున్నాయని గ్రహించాలి. వెంటనే తగు చర్యలు తీసుకుని పర్యావరణాన్ని కాపాడాలి.  పారిశుద్ధ్య లోపం... ప్రజారోగ్యానికి శాపం కాకుండా చూడాలి.

Friday, 5 October 2012

నాట్య మయూరి


ఇంద్ర ధనస్సులా...
హరివిల్లులా ...
పింఛము విప్పి 
నాట్యమాడింది మయూరి.
నూత నో త్సా హాన్నినింపుకుని,
ఆహ్వానం పలుకుతూ... 
మనసును ఆహ్లాదపరుస్తూ...
హృదయాన్ని గిలిగింతలు పెడుతూ ...


Monday, 1 October 2012

గాంధీ జయంతి శుభాకాంక్షలు!



జాతిపిత మహాత్మాగాంధీ  జయంతి సందర్భంగా దేశంలో శాంతి, మతసామరస్యం నెలకొల్పేందుకు కృషి చేద్దాం!  గాంధీజీ చూపిన  బాటలో పయనిద్దాం!!
గాంధీ జయంతి శుభాకాంక్షలతో ...


Sunday, 30 September 2012

విరిసిన పువ్వులు



   మన కళ్ళ ఎదుట రకరకాల రంగుల పూలు కనిపించినా... వాటి వాసనలు తగులుతున్నా...మానసిక ప్రశాంతత వస్తుంది.  సుకుమారమైన అందం, మనోహరమైన వాటి పరిమళ భరితాలు మనసును ఉల్లాసపరుస్తాయి.  అంతేకాదు ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా మార్చేఈశక్తి పుష్పాలకుంది.  పని చేయడంలో ఉత్సాహాన్ని ఇస్తాయి.  సంపెంగ, బసంతి, చమేలీ, మాధవీలత, మల్లెలు, జాజులు, సన్నజాజులు, విరజాజులు, మొగలి, రంగురంగుల మందారాలు, గులాబీలు ఒళ్ళు విరుచుకుంటూ, రేకులన్నీ విప్పార్చుకుంటూ  సుగంధాన్ని వెదజల్లే మకరందాలే! మనసును మధురోహల్లో ముంచెత్తే సుమమనోహర సౌగంధాలే!!  ఈ పూల మొక్కలను  మన పెరట్లో పెంచుకోవచ్చు.  అపార్ట్ మెంట్లో అయితే కుండీలలో పెంచుకుని ఇంటిని పూలవనంగా మార్చుకోవచ్చు. కుసుమాలలో ఉన్న పరిమళం మనసుని ఆహ్లాదపరుస్తాయి.  వీటి సౌందర్యం మనకు స్వాగతం పలుకుతాయి.


Tuesday, 18 September 2012

వినాయక చవితి శుభాకాంక్షలు!


జీవితంలో ఎదురయ్యే సర్వ విఘ్నాలు తొలగించి విజయాలను దరిచేర్చేవాడు విఘ్నేశ్వరుడు. మన దేశంలో మొదట పూజించేది,స్మరించేది గణపతినే.  దేవతాగణంలో అగ్రపుజ ఆయనకే.  అందుకే ఆయనను 'ఆదిదేవుడు' అంటారు.  ఏ శుభకార్యం తలపెట్టినా ముందుగా వినాయకుడిని పూజిస్తే, ఆపదలు తొలగుతాయని తలపెట్టిన పనిలో విజయం కలుగుతుందని భక్తుల విశ్వాసం.  హిందూ సంప్రదాయాలలో అన్ని ప్రాంతాలలో, అన్ని ఆచారాలలో వినాయకుని పూజకు అత్యంత ప్రాముఖ్యత వుంది.  వినాయక చవితికి ఒక ప్రత్యకత ఉంది.  కుల మత, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజించడం.

 వినా వితి ' శుభ సందర్భంగా బ్లాగ్ మిత్రులందరికీ నా హృదయ పూర్వక  శుభాకాంక్షలు!