”శోధిని”

Sunday, 19 February 2012

అంతా శివమయం---అంతటా శివారాధన!


అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు!
                         
      ప్రతి సంవత్సరం మాఘమాసంలో చతుర్ధశి నాడు వచ్చే పర్వదినం మహాశివరాత్రి. నెలకొక శివరాత్రి వస్తుంది.  కానీ, ఉత్తరాయణం, మాఘమాసంలో వచ్చే శివరాత్రిని మహా శివరాత్రి అని పిలువబడుతోంది. మిగతా పదకొండు శివరాత్రులను మాస శివరాత్రులంటారు. మహాశివరాత్రి అనగా మంగళకరమైన రాత్రి. తేజోలింగ రూపంలో శివుడు అర్థరాత్రి ఆవిర్భవించిన రోజు.  అందుకే రాత్రి జాగారానికి విశేషమైన ప్రాముఖ్యత వుంది.  శివుడు లింగ రూపం నుండి నిజరుపానికి వచ్చే శుభప్రదమైన రోజు. సంవత్సరం సోమవారం మహాశివరాత్రి రావడం విశేష  ఫలప్రదం. అంతేకాకుండా చతుర్దశి తిధి శివునికి అత్యంత ప్రీతికరమైనదిమహా శివరాత్రి నాడు శివునికి అభిషేకం, పగలు ఉపవాసం, రాత్రి జాగారణ చేసి భక్తితో కొలిచిన వారికి అనంతమైన పుణ్య ఫలాలు, సకల శుభాలు కలుగుతాయని చెబుతారు.  పూజా సమయంలో లింగాష్టకాన్ని పఠిస్తే అష్టైశ్వర్యాలు సిద్దిస్తాయి .  శివరాత్రి రోజంతా శివాలయాలలో శంభో శంకరహరహర మహాదేవ, ఓం నమశ్శివాయ అనే పంచాక్షరీ మంత్రంతో మారుమోగుతాయి. ఆరోజు భక్తుల హృదయాలు శివతత్వంతో నిండిపోతాయి.  శివ అనే పదాన్ని స్మరించగానే పాపాలన్నీ నశించి మోక్షం సిద్దిస్తుంది.
 
 లింగాష్టకం
'బ్రాహ్మమురారిసురార్చితలింగం-నిర్మలభాసితశోభితలింగం I
జన్మజదుఃఖవినాశకలింగం - తత్ప్రణమామి సదాశివలింగమ్‌| 1

దేవమునిప్రవరార్చితలింగం - కామదహనకరుణాకరలింగం |
రావణదర్పవినాశకలింగం - తత్ప్రణమామి సదాశివలింగమ్‌| 2

సర్వసుగంధిసులేపితలింగం - బుద్ధివివర్ధనకారణలింగం |
సిద్ధసురాసురవందితలింగం - తత్ప్రణమామి సదాశివలింగమ్‌| 3

కనకమహామణిభూషితలింగం - ఫణిపతివేష్టితశోభితలింగం |
దక్షసుయజ్ఞవినాశనలింగం - తత్ప్రణమామి సదాశివలింగమ్‌| 4

కుంకుమచందనలేపితలింగం - పంకజహారసుశోభితలింగం |
సంచితపాపవినాశనలింగం - తత్ప్రణమామి సదాశివలింగమ్‌| 5

దేవగణార్చితసేవితలింగం - భావైర్భక్తిభి రేవ లింగం |
దినకరకోటిప్రభాకరలింగం - తత్ప్రణమామి సదాశివలింగమ్‌| 6

అష్టదళోపరివేష్టితలింగం - సర్వసముద్భవకారణలింగం |
అష్టదరిద్రవినాశనలింగం - తత్ప్రణమామి సదాశివలింగమ్‌| 7

సురగురుసురవరపూజితలింగం - సురవరపుష్పసదార్చితలింగం |
పరమపరం పరమాత్మకలింగం - తత్ప్రణమామి సదాశివలింగమ్‌| 8

లింగాష్టక మిదం పుణ్యం - యః పఠే చ్ఛివసన్నిధౌ |
శివలోక మవాప్నోతి - శివేన సహ మోదతే|

ఇతి లింగాష్టకం సంపూర్ణమ్‌'

Saturday, 18 February 2012

పూల రంగడు హిట్ కొట్టాడు.



శనివారం విడుదలైన 'పూల రంగడు' చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల మన్నలను అందుకుంటోందిసునీల్ హీరోగా మరో విజయాన్ని సొంతం చేసుకున్నాడు.  యంగ్ హీరోలకు సవాల్ విసిరినట్టుగా వుంది  అతని నటన.  చాలా కష్టపడి స్థాయికి వచ్చిన సునీల్ చిత్రం కోసం ఎంతో శ్రమించాడని ప్రతి సన్నివేశంలోనూ కనబడుతుంది. సినిమాలో కామెడీ, పాటలు, డ్యాన్స్, పైట్లు, సంభాషణలు, సంగీతం  అన్నీసమపాలలో కుదిరాయి. నటీనటులంతా చక్కగా నటించారు.  అయితే హిరోయిన్ ఇషాచావ్లా ఆకట్టుకోలేకపోయింది.  అక్కడక్కడా మర్యాద రామన్న సినిమా పోలికలు కనబడినా వాటి గురించి పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదు.  దర్శకులు ప్రతి సన్నివేశంలోనూ హాస్యాన్ని పండించారు. మధ్య విడుదలైన చిత్రాలలో 'పూల రంగడు' ని  మంచి చిత్రంగా చెప్పవచ్చు.

Tuesday, 14 February 2012

పేద రోగులను కాపాడండి!



జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మెలో భాగంగా శుక్రవారం నుంచి అత్యవసర సేవలను బహిష్కరించడంతో ప్రభుత్వ ఆసుపత్రులల్లో సకాలంలో వైద్యం అందక రోగులు విలవిలలాడుతున్నారు.  ఇటు జూనియర్ డాక్టర్లు భీస్మించు కోవడం, అటు ప్రభుత్వం మొండి పట్టుదలకు పోవడంతో అనేకమంది రోగుల ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. డబ్బున్నవాళ్ళు కార్పోరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటుంటే, పేద రోగులు మాత్రం దిక్కు తోచక  ప్రాణాలు పోగొట్టు కుంటున్నారు.  ఇంత జరుకుతున్నా జూనియర్ డాక్టర్స్ లోనూ,ప్రభుత్వంలోనూ చలనం లేకపోవడం బాధాకరం.  అన్ని ప్రభుత్వ ఆసుపత్రులల్లో రోగుల అవస్థలు వర్ణణాతీతం.  ఇప్పటికైనా అమాయక పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని జూనియర్ డాక్టర్లు వెంటనే సమ్మె విరమించి, చర్చల ద్వారా తమ డిమాండ్లను పరిష్కరించుకోవాలి. ప్రభుత్వంకూడా బెట్టుకుపోకుండా ఒక మెట్టు దిగి సమ్మెను విరమింపజేయాలి

పేద రోగులను కాపాడండి!

జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మెలో భాగంగా శుక్రవారం నుంచి అత్యవసర 
వైద్య సేవలను బహిష్కరించడంతో ప్రభుత్వ ఆసుపత్రులల్లో సకాలంలో వైద్యం 
అందక రోగులు విలవిలలాడుతున్నారు.  ఇటు జూనియర్ డాక్టర్లు భీస్మించు కోవడం, అటు ప్రభుత్వం మొండి పట్టుదలకు పోవడంతో అనేకమంది రోగుల 
ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి.  డబ్బున్నవాళ్ళు కార్పోరేట్ ఆసుపత్రుల్లో 
వైద్యం చేయించుకుంటుంటే, పేద రోగులు మాత్రం దిక్కు తోచక  ప్రాణాలు పోగొట్టు కుంటున్నారు.  ఇంత జరుకుతున్నా జూనియర్ డాక్టర్స్ లోనూ,
ప్రభుత్వంలోనూ చలనం లేకపోవడం బాధాకరం.  అన్ని ప్రభుత్వ ఆసుపత్రులల్లో రోగుల అవస్థలు వర్ణణాతీతం.  ఇప్పటికైనా అమాయక పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని జూనియర్ డాక్టర్లు వెంటనే సమ్మె విరమించి, చర్చల ద్వారా తమ డిమాండ్లను పరిష్కరించుకోవాలి. ప్రభుత్వం కూడా
బెట్టుకు పోకుండా ఒక మెట్టు దిగి సమ్మెను విరమింప జేయాలి.

Sunday, 12 February 2012

ప్రేమోత్సవం



          ప్రేమ పక్షులు ఎంతో ఆశగా ఎదురుచూసే రోజు ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే.  ప్రేమ  జంటలు ఒకరిపట్ల  ఒకరికి గల ప్రణయ భావాలను వ్యక్త పరచే ఉత్సవం పండుగ.  జీవితంలో ప్రతి మనిషికి ఏదో ఒక దశలో కలవడం, అది ప్రేమగా మారడం పరిపాటే.  మనసులో ఉల్లాసాన్ని,ఉత్సాహాన్ని నింపే ప్రేమ గురించి యువతీయువకులు ఎన్నెన్నో కళలు కంటారు. కోరుకున్న వారిలో ఎన్నో ఆనందానుభూతులు  అనుభవించాలని ఉవ్విళ్ళురుతారు.  తన మనసు మెచ్చినవారికి అందమైన  కానుకలు, గ్రీటింగ్  కార్డులు అందిస్తూ ఆనందంతో బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా గాలిలో తెలిపోతుంటారు.  ప్రేమ చిహ్నమయిన గులాబీలను అందిస్తూ అనిర్వచనీయమైన అనుభూతిని పొందుతారు.  ఒకరిపట్ల  ఒకరికున్న ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను తీయని మాటల్లో వ్యక్త పరచినప్పుడు కలిగే ఆనందం వర్ణణాతీతం. తొలిచూపుల్లొ చూపులు కలిసి ప్రేమ పుట్టడం, ప్రేమ  చివరిదాకా నిలిచి ఉండడమే స్వచ్చమైన  ప్రేమ

          ప్రేమ అంటే రెండు మనసులు నిజాయితీగా, నమ్మకంతో ఒకడవడం.   నమ్మకాన్ని జీవితకాలం నిలబెట్టుకోవడం.  ఒకరిపట్ల  ఒకరికి పూర్తి  విశ్వాసం ఉంటే ప్రేమ  కలకాలం నిలుస్తుంది.  స్వచ్చమైన ప్రేమకు  వాలెంటైన్స్ డేలు  అక్కర్లేదు.  నిజమైన, నమ్మకమైన ప్రేమకు ప్రతిరోజూ వాలెంటైన్స్ డేనే.  ప్రేమ కోసం పరితపించి ప్రాణ త్యాగం చేసిన  వాలెంటైన్స్ డే. స్మృతి చిహ్నంగా ప్రేమికులు  ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటున్నారు. కాని, విషాదాన్ని పండుగగా జరుపుకోవడం ఏమిటి? అదే ప్రేమ విజయం సాధిస్తే, పండుగ చేసుకుంటే దానికొక అర్థం ఉంటుంది.  విషాదం నింపిన రోజున వాలెంటైన్స్ కి రెండు నిముషాలు మౌనం పాటిస్తే అతని ఆత్మ సంతోషిస్తుంది.  అలా కాకుండా పండుగ చేసుకుంటే అతని ఆత్మ ఘోషిస్తుంది.  విషాదం నింపిన రోజును ప్రేమికులు పండుగ చేసుకోవడం సబబేనా! ప్రతి ప్రేమ జంట తొలిసారిగా ప్రేమలో పడిన రోజును పండుగ చేసుకుంటే దానికొక అర్థం ఉంటుంది.   ప్రేమోత్సవాన్ని ప్రతి ఏడాది జరుపుకుంటే అదే ప్రేమికుల దినోత్సవం అవుతుంది.