శనివారం విడుదలైన 'పూల రంగడు' చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల మన్నలను అందుకుంటోంది. సునీల్ హీరోగా మరో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. యంగ్ హీరోలకు సవాల్ విసిరినట్టుగా వుంది అతని నటన. చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చిన సునీల్ ఈ చిత్రం కోసం ఎంతో శ్రమించాడని ప్రతి సన్నివేశంలోనూ కనబడుతుంది. ఈ సినిమాలో కామెడీ, పాటలు, డ్యాన్స్, పైట్లు, సంభాషణలు, సంగీతం అన్నీసమపాలలో కుదిరాయి. నటీనటులంతా చక్కగా నటించారు. అయితే హిరోయిన్ ఇషాచావ్లా ఆకట్టుకోలేకపోయింది. అక్కడక్కడా మర్యాద రామన్న సినిమా పోలికలు కనబడినా వాటి గురించి పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదు. దర్శకులు ప్రతి సన్నివేశంలోనూ హాస్యాన్ని పండించారు. ఈ మధ్య విడుదలైన చిత్రాలలో 'పూల రంగడు' ని ఓ మంచి చిత్రంగా చెప్పవచ్చు.
No comments:
Post a Comment