అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు!
ప్రతి సంవత్సరం మాఘమాసంలో చతుర్ధశి నాడు వచ్చే పర్వదినం మహాశివరాత్రి. నెలకొక శివరాత్రి వస్తుంది. కానీ, ఉత్తరాయణం, మాఘమాసంలో వచ్చే శివరాత్రిని మహా శివరాత్రి అని పిలువబడుతోంది. మిగతా పదకొండు శివరాత్రులను మాస శివరాత్రులంటారు. మహాశివరాత్రి అనగా మంగళకరమైన రాత్రి. తేజోలింగ రూపంలో శివుడు అర్థరాత్రి ఆవిర్భవించిన రోజు. అందుకే ఆ రాత్రి జాగారానికి విశేషమైన ప్రాముఖ్యత వుంది. శివుడు లింగ రూపం నుండి నిజరుపానికి వచ్చే శుభప్రదమైన రోజు. ఈ సంవత్సరం సోమవారం మహాశివరాత్రి రావడం విశేష ఫలప్రదం. అంతేకాకుండా చతుర్దశి తిధి శివునికి అత్యంత ప్రీతికరమైనది. మహా శివరాత్రి నాడు శివునికి అభిషేకం, పగలు ఉపవాసం, రాత్రి జాగారణ చేసి భక్తితో కొలిచిన వారికి అనంతమైన పుణ్య ఫలాలు, సకల శుభాలు కలుగుతాయని చెబుతారు. పూజా సమయంలో లింగాష్టకాన్ని పఠిస్తే అష్టైశ్వర్యాలు సిద్దిస్తాయి . శివరాత్రి రోజంతా శివాలయాలలో శంభో శంకర, హరహర మహాదేవ, ఓం నమశ్శివాయ అనే పంచాక్షరీ మంత్రంతో మారుమోగుతాయి. ఆరోజు భక్తుల హృదయాలు శివతత్వంతో నిండిపోతాయి. శివ అనే పదాన్ని స్మరించగానే పాపాలన్నీ నశించి మోక్షం సిద్దిస్తుంది.
లింగాష్టకం
'బ్రాహ్మమురారిసురార్చితలింగం-నిర్మలభాసితశోభితలింగం I
జన్మజదుఃఖవినాశకలింగం - తత్ప్రణమామి సదాశివలింగమ్| 1
దేవమునిప్రవరార్చితలింగం - కామదహనకరుణాకరలింగం |
రావణదర్పవినాశకలింగం - తత్ప్రణమామి సదాశివలింగమ్| 2
సర్వసుగంధిసులేపితలింగం - బుద్ధివివర్ధనకారణలింగం |
సిద్ధసురాసురవందితలింగం - తత్ప్రణమామి సదాశివలింగమ్| 3
కనకమహామణిభూషితలింగం - ఫణిపతివేష్టితశోభితలింగం |
దక్షసుయజ్ఞవినాశనలింగం - తత్ప్రణమామి సదాశివలింగమ్| 4
కుంకుమచందనలేపితలింగం - పంకజహారసుశోభితలింగం |
సంచితపాపవినాశనలింగం - తత్ప్రణమామి సదాశివలింగమ్| 5
దేవగణార్చితసేవితలింగం - భావైర్భక్తిభి రేవ చ లింగం |
దినకరకోటిప్రభాకరలింగం - తత్ప్రణమామి సదాశివలింగమ్| 6
అష్టదళోపరివేష్టితలింగం - సర్వసముద్భవకారణలింగం |
అష్టదరిద్రవినాశనలింగం - తత్ప్రణమామి సదాశివలింగమ్| 7
సురగురుసురవరపూజితలింగం - సురవరపుష్పసదార్చితలింగం |
పరమపరం పరమాత్మకలింగం - తత్ప్రణమామి సదాశివలింగమ్| 8
లింగాష్టక మిదం పుణ్యం - యః పఠే చ్ఛివసన్నిధౌ |
శివలోక మవాప్నోతి - శివేన సహ మోదతే|
ఇతి లింగాష్టకం సంపూర్ణమ్'

No comments:
Post a Comment