”శోధిని”

Sunday, 12 February 2012

ప్రేమోత్సవం



          ప్రేమ పక్షులు ఎంతో ఆశగా ఎదురుచూసే రోజు ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే.  ప్రేమ  జంటలు ఒకరిపట్ల  ఒకరికి గల ప్రణయ భావాలను వ్యక్త పరచే ఉత్సవం పండుగ.  జీవితంలో ప్రతి మనిషికి ఏదో ఒక దశలో కలవడం, అది ప్రేమగా మారడం పరిపాటే.  మనసులో ఉల్లాసాన్ని,ఉత్సాహాన్ని నింపే ప్రేమ గురించి యువతీయువకులు ఎన్నెన్నో కళలు కంటారు. కోరుకున్న వారిలో ఎన్నో ఆనందానుభూతులు  అనుభవించాలని ఉవ్విళ్ళురుతారు.  తన మనసు మెచ్చినవారికి అందమైన  కానుకలు, గ్రీటింగ్  కార్డులు అందిస్తూ ఆనందంతో బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా గాలిలో తెలిపోతుంటారు.  ప్రేమ చిహ్నమయిన గులాబీలను అందిస్తూ అనిర్వచనీయమైన అనుభూతిని పొందుతారు.  ఒకరిపట్ల  ఒకరికున్న ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను తీయని మాటల్లో వ్యక్త పరచినప్పుడు కలిగే ఆనందం వర్ణణాతీతం. తొలిచూపుల్లొ చూపులు కలిసి ప్రేమ పుట్టడం, ప్రేమ  చివరిదాకా నిలిచి ఉండడమే స్వచ్చమైన  ప్రేమ

          ప్రేమ అంటే రెండు మనసులు నిజాయితీగా, నమ్మకంతో ఒకడవడం.   నమ్మకాన్ని జీవితకాలం నిలబెట్టుకోవడం.  ఒకరిపట్ల  ఒకరికి పూర్తి  విశ్వాసం ఉంటే ప్రేమ  కలకాలం నిలుస్తుంది.  స్వచ్చమైన ప్రేమకు  వాలెంటైన్స్ డేలు  అక్కర్లేదు.  నిజమైన, నమ్మకమైన ప్రేమకు ప్రతిరోజూ వాలెంటైన్స్ డేనే.  ప్రేమ కోసం పరితపించి ప్రాణ త్యాగం చేసిన  వాలెంటైన్స్ డే. స్మృతి చిహ్నంగా ప్రేమికులు  ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటున్నారు. కాని, విషాదాన్ని పండుగగా జరుపుకోవడం ఏమిటి? అదే ప్రేమ విజయం సాధిస్తే, పండుగ చేసుకుంటే దానికొక అర్థం ఉంటుంది.  విషాదం నింపిన రోజున వాలెంటైన్స్ కి రెండు నిముషాలు మౌనం పాటిస్తే అతని ఆత్మ సంతోషిస్తుంది.  అలా కాకుండా పండుగ చేసుకుంటే అతని ఆత్మ ఘోషిస్తుంది.  విషాదం నింపిన రోజును ప్రేమికులు పండుగ చేసుకోవడం సబబేనా! ప్రతి ప్రేమ జంట తొలిసారిగా ప్రేమలో పడిన రోజును పండుగ చేసుకుంటే దానికొక అర్థం ఉంటుంది.   ప్రేమోత్సవాన్ని ప్రతి ఏడాది జరుపుకుంటే అదే ప్రేమికుల దినోత్సవం అవుతుంది.

No comments: