”శోధిని”

Monday, 31 August 2015

దేవతా విగ్రహాలు !


మన పురాణాలలో భగవంతుడికి ఎన్నో రూపాలు, పేర్లు చెప్పబడ్డాయి.  స్త్రీ, పురుష రూపాలలో వేరు వేరు పేర్లతో భగవంతుడిని ఆరాధించవచ్చని మన హిందూ సంప్రదాయం చెబుతుంది.  పురాణాలలో చెప్పబడ్డ రూపాలను విగ్రహాల రూపంలో మన ముందు ఉంచుకుని పూజించడం ద్వారా  ఆ విగ్రహాల మీద మనకు భక్తి విశ్వాసాలు ఎక్కువవుతాయి.  మన కళ్ళకు సాధారణంగా కనబడని దేవుడు విగ్రహాల రూపంలో మనకు దర్శనమిస్తూ మనల్ని సదా రక్షిస్తుంటారనే భావన మనలో కలుగుతుంది.  ఆ భావనే మనలో మంచి గుణాలను కలగడానికి సహాయం చేస్తుంది.  పెద్దలను గౌరవించడం, తోటివారికి సహాయం చేయడం, బాగా చదివి ప్రయోజకుడు కావడం వంటి మంచి సుగుణాలు... దైవభక్తి  వున్నవాళ్లలో కలుగుతాయి.  నిర్థిష్ట మార్గంలో నడుస్తూ, క్రమపద్దతిలో జీవనం సాగిస్తూ...దుర్మార్గులకు, దురాచాలకు దూరంగా ఉండమని, శాంతి, సహనంవంటి సత్త్వగుణాలను,  నైతిక విలువలను పెంచుకోవడానికి ఉపయోగపడతాయి.  ఇవన్నీ దైవాన్ని నమ్మడం ద్వారా  కలుగుతాయి.   

Thursday, 27 August 2015

తెలుగిళ్ళల్లో వరలక్ష్మి వైభవం !


మహాలక్ష్మికి అత్యంత ఇష్టమైనది శ్రావణమాసం...
మహిళలకు సౌభాగ్యాన్ని ప్రసాదించేది శ్రావణమాసం...
ప్రతి ఇంటా ఆధ్యాత్మిక సుమాల గుబాళింపు ...
సకల సౌభాగ్యాల పదాత...వరలక్ష్మి మాత 
సౌభాగ్యప్రదం...మంగళప్రదం 
ఎంతో శుభదాయకం.... వరలక్ష్మివ్రతం!


Sunday, 23 August 2015

గోమాతను పూజిద్దాం !


పవిత్రతకు, శుభానికి చిహ్నం గోవు.  సకల దేవతలు తన శరీరంలో కొలువై వున్న గోమాత, ప్రత్యక్ష దైవంగా హిందువులచేత పూజలందుకుంటోంది. మన సంప్రదాయంలో గోమాతను పూజించడం గొప్ప ఆచారం. గోమాతను  దర్శించినా, స్పర్శించినా  కోటి పుణ్యాలు లభిస్తాయని మన వేదాలు చెబుతున్నాయి. అందుకే గోమాతను  సకలదేవతా స్వరూపముగా భావించి పూజిస్తే, పుణ్యఫలం దక్కుతుందంటారు.


 

Saturday, 22 August 2015

" శ్రావణలక్ష్మి "


       మహిళామణులకు అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణమాసం.  ఈ  మాసంలో మంగళ, శుక్రవారాల్లో పసుపు, కుంకుమ, పువ్వులు, దీపంలో  లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. శ్రావణమాసంలో ప్రతి రోజూ పవిత్రమేనదే. ముఖ్యంగా సోమవారాలు అభిషేక ప్రియుడయిన పరమేశ్వరుణ్ణి అభిషేకిస్తే ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. అదేవిధంగా మంగళవారాలు గౌరీదేవిని, శుక్రవారాల్లో లక్ష్మీదేవిని భక్తిశ్రద్దలతో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి.  వృద్ధిని, సంపదని, ఆయురారోగ్యాలను ప్రసాదించే  లక్ష్మీదేవిని పూజించి ఆతల్లి అనుగ్రహం పొందుదాం.

Thursday, 20 August 2015

మా పనిమనిషి ! (జోక్ )

"నువ్వెప్పుడూ సాహితీ సమావేశాల్లో క్షణం తీరిక లేకుండా గడుపుతావ్ ....  ఇంట్లో పని మనిషిని మాన్పించావ్....  ఇల్లు చూస్తే చాలా శుభ్రంగా ఉంటుంది.  ఇది ఎలా సాధ్యం ?" గాయత్రిని అడిగింది ఆశ్చర్యంగా తన స్నేహితురాలు.
"పని మనిషి లేదన్నాను కాని,  మా వారు లేరని చెప్పలేదుగా !" అంది  విలాసంగా కాళ్ళు ఊపుతూ 
"అంటే మీవారిచేత ఇంటి పని చేయిస్తున్నావా ?"
"చేయిస్తే తప్పేమిటి?  పది లక్షలు కట్నం ఇచ్చి కొన్నాను ...అందుకే ఇంటిపని, వంటపని, తోటపని చేయాలి తప్పదు."
"నా కళ్ళు తెరిపించావు ... వెంటనే మా పనిమషిని కూడా మాన్పించాలి" అంటూ హడావుడిగా ఇంటికి బయలు దేరింది గాయత్రి  స్నేహితురాలు.

 

Wednesday, 19 August 2015

అవినీతి జలగలు !

ప్రభుత్వ ఉద్యోగాలు 
పని తక్కువ 
పరిహారం ఎక్కువ 
లక్షల్లో జీతాలు 
అయినా లంచాలు 
ప్రతి ఆఫీసుల్లోనూ
అవినీతి జలగలే !
ప్రభుత్వాలు మారినా
మారని చేతివాటాలు !!

 

Tuesday, 18 August 2015

ఇది మా ఆచారం ! ( జోక్ )

ఆపరేషన్ థియేటర్ లో ఆపరేషన్ జరుగుతోంది.  బయట బందువులందరూ భాధను దిగమింగుతూ... ఆపరేషన్ విజయవంతం కావాలని కోరుకుంటున్నారు.  ఇంతలో నర్స్ పెద్ద పూలదండతో ఆపరేషన్ థియేటర్ లో వెళుతుంటే, పేషెంట్ బంధువులకు అనుమానం వచ్చి...                             "పూలదండ ఎందుకండీ " ఆతృతగా అడిగారు.
"డాక్టర్ గారు తొలిసారిగా ఆపరేషన్ చేస్తున్నాడు.   విజయవంతమైతే డాక్టర్ గారికి వేసి అభినందనలు చెబుతాం.  ఫెయిలయితే పేషెంట్ మెడలో వేసి సానుభూతి వ్యక్తపరుస్తాం.  ఇది మా ఆసుపత్రి ఆచారం."

Sunday, 16 August 2015

అనాధుల పాలిట ఆపద్భాందవులు !




కనిపెంచిన తల్లిదండ్రులను నిర్ధాక్షిణంగా ఇంటినుంచి తరిమేస్తున్న కొడుకులు కొందరైతే, కన్నపేగును తెంచుకొని పుట్టిన  బిడ్డల్ని అనాధలుగా రోడ్డుపై వదిలేస్తున్న తల్లిదండ్రులు మరికొందరు. ఇతర ప్రాంతాల నుంచి పిల్లలను తీసుకొచ్చి పట్టణాలలో వదిలేసేవారు ఇంకొందరు. ఇలా తమ పేగుబంధాన్ని దూరం చేసుకుంటున్న ఈ రోజుల్లో అనాధుల పాలిట ఆపద్భాందవులు, మానవత్వం ఉన్న మనుష్యులు ఇంకా ఉన్నారని 'ఆపన్న హస్తాలు' ముఖపుస్తకం ద్వారా కొందరు మిత్రులు తెలియజేస్తున్నారు.   ప్రతి నెలా తమ సంపాదనలో కొంత డబ్బు కనీసం వంద రూపాయలు తగ్గకుండా అనాధుల కోసం కేటాయిస్తూ ఉడతాభక్తితో సమర్పించుకుంటున్నారు. వారందరికీ కృతఙ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.


Friday, 14 August 2015

మదినిండా ...మువ్వన్నెల జెండా!



 నెత్తురు మడుగులో దొర్లుకుంటూ...
ఊపిరి ఉన్నత వరకు శత్రువులతో పోరాడి
మనకోసం అమరులైన వీరులకు జోహార్లు !
వారి త్యాగాన్ని తలుచుకుంటూ...
త్రివర్ణ పతకాన్ని ఎగురవేద్దాం!!
మనకోసం నిరంతరం శ్రమిస్తున్న
వీరజవానులకు అండగా నిలుద్దాం !!!



Monday, 10 August 2015

'' గర్వం"



కులమత గర్వం కొందరిది
ధన అహంకారం మరికొందరిది
ఒకరు ముందు, మరొకరు వెనుక
అందరూ ఏదోకరోజు
మట్టిలో కలిసిపోయే వాళ్ళమే !
ఎందుకీ  కులమత  ధనఅహంకారాలు  ?
కులమతాలు చూడకుండా
చెట్లు అందరికీ నీడనిస్తున్నాయి
నదులు దాహార్తిని తీరుస్తున్నాయి 
మన నుండి ఏదీ ఆశించని గోమాతలు
అమృతతుల్యమైన  క్షీరాన్ని అందిస్తున్నాయి
మనం తినే ఆహారం, పీల్చే గాలి, తాగే నీరు
అన్నీ ప్రకృతి అందిస్తున్న  సేవలే !
పంచభూతాలకు లేని వ్యత్యాసాలు 
మధ్యలోపోయే మనుష్యులకెందుకో !


Friday, 7 August 2015

నక్కజిత్తులు !

లోకం ముందు నక్కజిత్తులు 
ఎన్నివేశాలు వేసినా ..
ఎప్పుడో ఒకప్పుడు
వారి బండారం బయటపడుతుంది 
వ్యక్తుల గుండెల్లో 
నిజాయితీ ఉంటే ...
ఆలస్యంగా నైనా
వాళ్ల వ్యక్తిత్వం ఆకట్టుకుంటుంది.
నమ్మబలకడం 
అవకాశవాదుల నైజం !
మోసపోవడం 
అమాయకుల తత్వం !!



Tuesday, 4 August 2015

అంతా... రాజకీయమే !


చట్టసభల సమావేశాలు జరుగుతున్న తీరు తీవ్ర అసంతృప్తి కలిగిస్తోంది.  ప్రతిపక్షాలు  సభలు జరగకుండా చేయడం,  అధికార పక్షం  దానికి ధీటుగా వ్యవహరించడంతో   చట్టసభల   సమావేశాల సమయం హరించుకుపోతోంది. ప్రజల సమస్యల పైన చర్చించి, వాటి పరిష్కారానికి మార్గాలను అన్వేషించవలసిన చట్టసభలు   నేతల పరస్పర ఆరోపణలకు వేదికగా ఉపయోగించుకోవడం వల్ల ఎంతో విలువైన ప్రజాధనం వృధా అవుతోంది.  ప్రజాస్వామ్య వాదులకు ఉండవలసిన సహనం, సంయమనం ఇటు అధికార పక్షంలోనూ, అటు ప్రతిపక్షం లోనూ లోపించడం ప్రజల దురదృష్టకరం.   ప్రజాసమస్యలను చర్చించకుండా, కళింకిత మంత్రుల రాజీనామా కోసం   సభల ప్రతిస్థంభనకు గురికావడం బాధాకరం.  తప్పుచేసినవాళ్లు నిజాయితిగా తప్పుకుంటే విలువ వుంటుంది.  మేము తప్పుచేయలేదు దేవుడో చర్చలకు మేం సిద్దం అని మంత్రులు  అంటుంటే, సభలో చర్చించకుండా రాజీనామా కోసం పట్టుపట్టి సభలను జరనీయకుండా చేయడం....  ఈ రాజకీయాలేమిటో... ప్రజలకు అర్థం కావడం లేదు.  

Saturday, 1 August 2015

స్నేహబంధం


వీర భక్తుడు !



వాయుదేవుని అనుగ్రహంతో కేసరి అంజనీదేవులకు జన్మించినవాడు హనుమంతుడు. సూర్యభగవానుడి దగ్గర వేదశాస్త్రాలు అభ్యసించిన ఆంజనేయుడు భక్తులలో అగ్రగణ్యుడు. అపారగునసంపన్నుడు. శ్రీరామ భక్తుడయిన శ్రీ ఆంజనేయస్వామిని పూజించిన వారికి,  స్తుతించినవారికి గ్రహదోషాలు దూరమవుతాయని, శ్రీరాముని అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం.